టిఫిన్లు తిని స్పూన్లు, ప్లేట్లు ఎత్తుకెళ్తున్న కస్టమర్లు.. ఓనర్లు చివరికి ఏం చేశారంటే..

సాధారణంగా హోటల్లో( Hotel ) భోజనం చేసి ఎవరైనా సరే తృప్తిగా బయటకు వస్తారు.

అయితే ఒక క్యాంటీన్‌లో మాత్రం భోజనం చేసిన వారు ప్లేట్లు, చెంచాలు, గ్లాసులు ఎత్తుకెళ్తున్నారు.

రోజూ ఇదే తంతు జరుగుతోంది.దాంతో క్యాంటీన్‌ యాజమాన్యానికి( Canteen Owner ) డౌట్ వచ్చింది.

చివరికి 6 వేల స్పూన్‌లు, 400 పేట్లు, 100కి పైగా గ్లాసులు మాయమయ్యాయి.

ఇంత పెద్ద సంఖ్యలో సామాగ్రి పోవడంతో యాజమాన్యం షాక్ అయింది."అరె బాబు మీరు తిన్నంత ఫుడ్ పెడతాం కానీ ఇలా సామాన్లు సర్దేయకండి" అంటూ యాజమాన్యం కస్టమర్లను బతిలాడుకుంది.

అయినా కూడా ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. """/" / దాంతో చేసేది లేక "తిన్న తర్వాత దయచేసి చెంచాలు ప్లేట్లు ఎత్తుకెళ్లకండి" అని ఒక పెద్ద నోటీస్ బోర్డు( Notice Board ) కూడా క్యాంటీన్ ముందు పెట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.ముంబైలోని ఛత్రపతి శివాజి టర్మినల్ సమీపంలో ఒక క్యాంటీన్‌ ఉంది.

దీని పేరు సిద్ధి వినాయక్ క్యాటరర్స్.ఈ క్యాంటీన్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు డైలీ వెయ్యి మందికి పైగా వచ్చి ఆహారం తింటుంటారు.

అయితే వీరిలో కొందరు దొంగలుగా అవతారం ఎత్తి దొరికిన ప్రతి సామాన్ను తమ సంచిలో లేదా జేబులో పెట్టుకొని ఎత్తుకెళ్తున్నారు.

"""/" / ఇలాంటి వింత దొంగతనం వల్ల యాజమాన్యం తలనొప్పులు ఎదుర్కొంటోంది."మీ వల్ల ఇతరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఎవరూ కూడా బయటికి టిఫిన్లు, భోజనాల ప్లేట్లు తీసుకెళ్లకూడదు.క్యాంటీన్ ఆవరణలోనే ఆహారం తినాలి.

" అని కూడా యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.ఏది ఏమైనా ఎక్కడా జరగని ఈ దొంగతనం ముంబైలోని జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక క్యాంటీన్ యాజమాన్యం ఎవరిపైనా ఇంతవరకు కేసు పెట్టలేదు.

మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?