దిష్టి తగలకుండా నల్లదారం కట్టుకునేవారు ఈ నియమాలను పాటించాల్సిందే..
TeluguStop.com
మనదేశంలో చాలామంది ప్రజలు సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు.అందుకోసమే ఈ ధర్మానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
అంతేకాకుండా వాస్తు నియమాలకు కూడా మన సంప్రదాయాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.అయితే సాధారణంగా చెప్పాలంటే మనదేశంలోని చాలామంది తల్లులు చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా నల్లటి కాటుకబొట్టును పెడుతుంటారు.
అంతేకాకుండా నల్ల దారం కూడా కడుతూ ఉంటారు.అలా కాటుక బట్టు పెట్టి కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందని మనదేశంలో చాలామంది ప్రజల నమ్మకం.
సాధారణంగా చిన్నపిల్లలు చూడడానికి ఎంతో క్యూట్ గా ఉంటారు కాబట్టి అందరూ వారి వైపు చూస్తూ ఉంటారు.
"""/"/
అందుకోసమే చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా నల్లదారం కడుతూ ఉంటారు.కానీ ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలకే కాకుండా పెద్దవారు కూడా ఈ నల్ల దారం కట్టుకుంటూ ఉన్నారు.
అయితే దిష్టి తగలకుండా కాలికి దారం కట్టుకునే సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి.
నియమాలను పాటించకుండా ఎప్పుడూ పడితే అప్పుడు నల్ల దారం కట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం అస్సలు ఉండదు.
కాళ్లకు నల్ల దారం కట్టుకునే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
దిష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టుకునేవారు అమావాస్య రోజు మాత్రమే అలా దిష్టి దారాన్ని కాలికి కట్టుకోవడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.
అమావాస్య రోజు కాకుండా వేరే రోజులలో ఈ దారాన్ని కాలికి కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని కూడా చెబుతున్నారు.
అంతేకాకుండా దిష్టి దారం కట్టుకున్న తర్వాత దాన్ని అలాగే అస్సలు ఉంచకూడదు.ఎక్కువ రోజులు పాటు దీన్ని మార్చుకోకుండా అలాగే ఉంచుకోవడం వల్ల కూడా దిష్టి తగలకుండా ఆపలేరు.
అందుకోసమే నెల రోజులకు ఒకసారి ఈ దారాన్ని మారుస్తూ ఉండడం ఉత్తమమైన పని.
ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజుకి ఒక రోజు ముందు కాలి దారం తీసేసి అమావాస్య రోజు కొత్త దారం కట్టడం వల్ల ఫలితం ఉంటుంది.
ముఖంపై నలుపు పేరుకుపోయిందా.. సులభంగా వదిలించుకోండిలా..!