ఏపీలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకోవలసిన వారు ఈ వివరాలు తెలుసుకోండి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతున్న సంగతి తెలిసిందే.రోజుకి ఇరవై వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో .

ఏపీ ప్రజలలో వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెగ ఉబలాట పడుతూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా ఇటీవల గుమ్మి కూడారు.

ఈ పరిణామంతో వ్యాక్సిన్ కేంద్రాలనుండి .వైరస్ అంటే అంటించుకునే రీతిలో పరిస్థితి మారటంతో రెండు రోజులపాటు ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఆపేయడం జరిగినది.

ఇదిలా ఉంటే రెండో డోస్ వ్యాక్సిన్ 45 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగినవారు.

వేయించుకోవాలి అని అనుకుంటే ప్రస్తుతం ఓటర్ స్లిప్పు తరహాలో.వ్యాక్సిన్ స్లిప్ ప్రభుత్వం అందిస్తోంది.

ఈ స్లిప్పు ఉంటేనే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద.టీకా వేస్తారని తాజాగా ప్రభుత్వం తెలిపింది.

దీంతో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అనుకునేవారు గ్రామ, వార్డు సచివాలయంలో గాని గ్రామ వాలంటీర్ వద్ద గాని .

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గాని, లేకపోతే ఏఎన్ఎం ఆశా కార్యకర్తల వద్ద గాని ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది.

రిజిస్టర్ చేయించుకున్న తర్వాత టోకెన్ ఇస్తారు.ఆ టోకెన్ తరహా స్లిప్పు ఉన్నవారికి మాత్రమే కేంద్రం వద్ద వ్యాక్సిన్ వేస్తారు అని.

ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో విపక్ష కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్.. దూరంగా బీజేపీ..!!