పెంపుడు కుక్క‌లు ఉన్న వారు ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందేన‌ట‌

ఇప్పుడున్న ప్ర‌పంచంలో దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో మ‌న‌కు పెంపుడు జంతువులు క‌నిపిస్తూనే ఉంటాయి.

కుక్క లేదా పిల్లి లాంటివి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి.ఇప్పుడున్న జీవ‌న ప్ర‌మాణంలో ప్ర‌తి ఒక్క‌రి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లో ఇవికూడా భాగ‌మైపోయాయి.

దీంతో ఇప్పుడు వీటిపై పెద్ద ఎత్తున బిజినెస్ కూడా న‌డుస్తోంది.దీంతో వీటికోసం సెప‌రేట్‌గా మ‌నుషుల్లాగే ఫుడ్ అలాగే బెడ్ లాంటివి కూడా అరేజం్ చేస్తున్నారు వీటిని పెంచుకునేవారు.

ఈయితే ఈ పెంపుడు కుక్క‌ల‌ను త‌మ య‌జ‌మానులు రోడ్ల మీద, పార్కులకు లేదా చెరువు గట్లకు సాయంత్రం లేదా మార్నింగ్ టైమింగ్స్ ల‌లో వాకింగ్‌కు తీసుకెళ్లడం మ‌నం అంద‌రం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇలాంటి టైమ్‌ల‌లో అవి ఇతరులను కరవడం లేదా అవి చేసే ప‌నుల వ‌ల్ల ఇత‌రుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌డం కూడా చూస్తుంటాం.

ఇక ఇలాంటి స‌మ‌యాల్లో వాటివ‌ల్ల ఆ య‌జ‌మానుల‌కు అలాగే ఇత‌రుల‌కు కూడా గొడవలు జరగుతున్నాయి.

ఇక వీట‌కి అడ్డుకట్ట వేసేలా బెంగళూరులో కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనంటూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

"""/"/ ప్ర‌తి పెంపుడు కుక్కల‌కు య‌జ‌మానులు క‌చ్చితంగా రేబీస్‌ వ్యాక్సిన్ ఇప్పించాల్సిందే.ఇక ఇండ్ల నుంచి ఈ పెంపుడు జంతువుల‌ను తీసుకుని ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్‌కు వెళ్లడానికి వీళ్లేదు.

ఇక చెరువులు లేదా ఇత‌ర ర‌ద్దీ ప్రాంతాల్లోకి వీటిని తీసుకెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా వీటి నోటికి బుట్టను పెట్టాల్సిందే.

బ‌య‌ట ప్ర‌దేశాల్లో ఇవి కాలకృత్యాలు చేస్తే దాన్ని ఆ య‌జ‌మానులు క‌చ్చితంగా శుభ్రపరచాలి.

లేక‌పోతే వారికి రూ.500 జరిమానా విధిస్తారంట‌.

అంతే కాదు రాట్‌వీలర్, జర్మన్‌ షెఫర్డ్స్, ఇత‌ర ఖ‌రీదైన పిట్‌బుల్ లేదా డాబర్‌మేన్ అలాగే గ్రేట్‌డేన్ ర‌కాల‌కు చెందిన పెంపుడు కుక్క‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో చెరువుల వద్దకు తీసుకెల్లొద్దంట‌.

మ‌రి కుక్కలు ఉన్న వారు ఈ రూల్స్ పాటించండి.