ఈ సమయంలో శ్రీవారి దర్శనం ఉన్నవారు అదృష్టవంతులే..

శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.శుక్రవారం రోజు 64,600 మంది స్వామి వారిని దర్శించుకున్నారు ఇంకా చెప్పాలంటే 27,500 మంది తలనీలాలను సమర్పించగా, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీ ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పించారు.

ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డైరెక్ట్ లైన్ నడుస్తూ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు మూడు గంటలలోపు దర్శనం చేసుకున్నారు.

మామూలుగా దర్శనానికి గంటలపాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది.కానీ చాలా తక్కువ సార్లు డైరెక్ట్ లైన్ దర్శనం భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది.

చేతిలో అసలు టోకెన్ ఏం లేకపోయినా మూడు గంటల్లో దర్శనం చేసుకుని రావడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరిగే అద్భుతమైన విషయం.

శుక్రవారం రోజు ఉదయం తిరుమల లో ఈ పరిస్థితి ఉంది.కానీ ఎందుకో శుక్రవారం రోజు మాత్రం ఎలాంటి టోకెన్లు లేకుండా డైరెక్ట్ లైన్ దర్శనం తిరుమల దేవస్థానం కల్పించింది.

అందుకే ఉదయం స్వామి వారి దర్శనానికి వెళ్లిన వాళ్లు నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి.

ఇంకా చెప్పాలంటే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా వేద పండితులు చెబుతున్నారు.

"""/"/ ఈ క్రమంలో ప్రత్యూష కాలహార ఆరాధనతో ఆలయ ద్వారాలను తెరిచిన అర్చకులు వైఖాన అర్చకులు సన్నిధి గుల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు.

బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రం తో స్వామి వారిని మేలుకొలుపుతారు.

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తర్వాత గొల్ల హారతి సమర్పణ జరుగుతూ ఉంటుంది.

ఆ తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్ధాన్ని భక్తితో వారందరూ స్వీకరించి ఆ తర్వాత సన్నిధి గొల్లలకు బ్రహ్మ తీర్ధాన్ని అందిస్తారు.

అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం చేస్తుండగా సన్నిధిలో శ్రీవారికి కర్పూర నిరాజనా సమర్పణ జరుగుతూ ఉంటుంది.

అమ్మాయి వల్ల వరుణ్ లావణ్య విడాకులు తీసుకుంటారు..ఆ దోషాలు ఉన్నాయి: వేణు స్వామి