ఆలయాలలో ప్రదక్షిణలు చేసేవారు.. ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి..

సాధారణంగా ప్రతిరోజు చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడానికి ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

ఇలా దేవాలయానికి వెళ్ళిన తర్వాత మొదట గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

అయితే గుడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయం లో చాలామందికి అనుమానం ఉంటుంది.

ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణం గా గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది గుడి చుట్టూ మూడు ప్రదిక్షణలు చేసి ఆ తర్వాత భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

భక్తులు దేవాలయంలో ఉన్న ధ్వజ స్తంభం దగ్గర నుంచి వారి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు.

నవగ్రహాల కు ప్రదక్షిణలు చేసే సమయంలో ఏదైనా దోషం ఉన్నవారు ఆ దోషాలను బట్టి తొమ్మిది లేదా 11 ప్రదక్షిణలు చేయడం మంచిది.

శివాలయంలో ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు.కానీ శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణలు చేయాలి.

ఇక ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం జరుగుతుంది.

అంతేకాకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిన భక్తులు తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయడం మంచిది.

"""/"/ ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన భక్తులు తొమ్మిది లేదా 11 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది.

అంతేకాకుండా సాయిబాబా దేవాలయంలో కూడా 9 లేదా 11 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.

గణపతి ఆలయానికి వెళ్ళిన భక్తులు ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయడం మంచిది.

అంతేకాకుండా గణపతి ముందు 11 గుంజీలు తీయడం వల్ల గణపతి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు ఆ స్టార్ పాలిట వరమయ్యాయా?