దళిత మహిళను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నల్లగొండ జిల్లా:నల్లగొండ రూరల్ మండలం( Nalgonda ) వెలుగుపల్లి గ్రామానికి చెందిన దళిత వివాహిత వల్లందాసు మంజుల( Manjula ) (35) ను అత్యంత దారుణంగా చున్నీతో ఉరిబెట్టి రాళ్లతో కొట్టి చంపిన వాజిద్ మరి కొంత మంది నిందితులను కఠినంగా శిక్షించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బాకరం శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత మహిళలపై అత్యంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయని, నిందితులు యధేచ్చగా తిరుగుతున్నారని,దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధించాలని, నిందితులపైన హత్య నేరం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ( Sc/st Atrocities )కేసు నమోదు చేసి, మంజుల కుటుంబానికి రూ.

20లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు.

స్థానిక డిఎస్పీ సమగ్రంగా విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కెవిపిస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను,విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొండేటి మురళి,కత్తుల సన్నీ, మృతురాలి కుమారుడు, పోతేపాక సహదేవ, వెలుగుపల్లి వార్డు మెంబర్లు పోతుపాక కిరణ్, పోతుపాక సతీష్, నాగార్జున,బ్రహ్మచారి, గ్రామస్తులు పోతుపాక యాదయ్య,లింగయ్య,రవి, సైదులు,నవీన్,చింతపల్లి వెంకన్న,కండే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నారా ?