Debts : అప్పులతో బాధపడుతున్నవారు.. ఈ ఆలయానికి వెళ్తే చాలు అప్పులు తీరినట్టే..!

మధ్య తరగతి కుటుంబాలలో చాలి చాలని జీతంతో జీవించడం చాలా కష్టం.పిల్లల చదువులు, ఫంక్షన్ లు, పండుగలు ఇలా ఎన్నో వాటికి డబ్బులు ఖర్చు చేయల్సి ఉంటుంది.

తమకు వచ్చిన జీవితం కూడా సరిపోదు.ఇంకా ఏమైనా చేద్దామంటే వయస్సు కూడా సహకరించదు.

దీని వలన చాలా మంది అప్పులు( Debts ) చేస్తూ ఉంటారు.వాటిని తీర్చడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు.

అలాంటప్పుడు ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉంటే ఇక ఏది అవసరం లేదనేది భక్తుల విశ్వాసం.

కొండలలో నెలకొన్న కోనేటి రాముడు కొండంతా అండను అందిస్తాడని తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు.

"""/" / అందులో ఒకటే ఈ చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం( Chilpur Bugulu Venkateswara Swamy Temple ).

ఇది జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఉంటుంది.తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి నడుచుకుంటూ వచ్చి చిల్పూర్ గుట్ట( Chilpur Gutta ) పై వెంకటేశ్వర స్వామి వెలిశారని చరిత్రలో ఉంది.

అసలు ఆ స్వామి వారికి ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు.

"""/" / ఒకానొక సందర్భంలో ఆ స్వామి వారు అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే అప్పు చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆ స్వామివారికి బుగులు, భయం మొదలైంది.

ఆ స్వామివారి బుగులు తో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ స్వామివారికి ఈ చిల్పూర్ ప్రదేశం అంతా కనిపిస్తుంది.

ఇక నిద్ర నుండి మేల్కొన్న స్వామి వారు ఈ చిల్పూర్ గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు.

ఈ గుట్ట కింద భాగాన తన పాదరక్షలు వదిలి కొండపై ఉన్న గుహలోకి వెళ్లి బుగులుతో తపస్సు చేస్తారు.

ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామి వారిని క్షమాపణ కోరుతారు.ఈ ప్రదేశానికి వచ్చినందుకు నా సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ స్వామివారు సంతోషిస్తారు.

కాబట్టి స్వామి వారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్న వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని చెబుతారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!