బీజేపీలో చేరిన ఆ ఇద్దరు టీఆర్ఎస్ లోకి.. హరీష్ రావు రాజకీయం!

జంపు జిలానీల గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిగా ఉంటుంది.కిల్లీ తిన్నంత సులభంగా నేటి కాలంలో నేతలు కండువాలు, మారుస్తూ.

పార్టీల్లోకి వెళ్తున్నారు.ఈ రోజు ఒక పార్టీ కండువా కప్పుకుని తిరిగిన నేతలు తెల్లారే సరికి వేరే పార్టీలో ప్రత్యక్షమవుతున్నారు.

ఒకప్పుడు అసలు పార్టీ మారడానికే తర్జన భర్జన పడే నేతల నుంచి నేడు పూటకో పార్టీ అంటూ మారే వరకు పరిస్థితులు వచ్చాయి.

ఉమ్మడి మెదక్​ జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచి మంచి పట్టు మీద ఉంది బీజేపీ.

అక్కడి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సాధ్యమైనంత ఎక్కువ మందిని టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి లాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ ప్రయత్నాల ఫలితంగానే నిన్న దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లలో ఇద్దరు దివిటి కనుకయ్య, బాలక్రిష్ణ ప్రస్తుతం గులాబీ కండువా కప్పుకున్నారు.

24 గంటలు కూడా గడవక ముందే వీరికి ఏం జ్ఞానోదయమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ట్రబుల్ షూటర్​ గా పేరుగాంచిన హరీశ్​ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ గ్రాఫ్​ పడిపోతుందని నిరూపించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్​ రావు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.

"""/"/ అదే ప్లాన్​లో భాగంగా నిన్న దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు అధికార పార్టీ వార్డు కౌన్సిలర్లను బీజేపీ స్టేట్​ ఛీఫ్​ బండి సంజయ్​ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేశారు.

కానీ రాత్రికి రాత్రే టీఆర్ఎస్​ నేతలు ఎలాగోలా వాళ్లను మరలా గులాబీ గూటికి చేర్చడంలో సఫలమయ్యారు.

ఇలా రోజు తిరగకుండానే కండువాలు మార్చిన నేతలు ప్రగతి ప్రభుత్వానికి జై.అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్​ లోనే ఉంటామని చెప్పడం గమనార్హం.

ఇలా కండువాలు మార్చుతూ రాజకీయాలు చేయడం సరికాదని పలువురు చర్చించుకుంటున్నారు.

పుష్ప ది రూల్ బీహార్ ఈవెంట్ పై విమర్శలు చేసిన సిద్దార్థ్.. ఏకంగా ఇంత జరిగిందా?