అశ్వినీదత్ ని నిండా ముంచిన ఆ రెండు సినిమాలు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి కొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి ఒక సంవత్సరంలో రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే అందులో 10 నుంచి 20 సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి అంటే సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి అందుకే ఇండస్ట్రీలో ఒక సినిమా మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ ఒకటి కి పదిసార్లు కథ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక సినిమా ఫ్లాప్ అయితే విపరీతమైన నష్టం వస్తుంది.
"""/" /
ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు అయిన అశ్విని దత్( Ashwini Dutt ) కూడా రెండు సినిమాల వల్ల ఆయన కోలుకోకుండ అయిపోయారు.
అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు సినిమా( Sainikudu Movie ) అయితే,ఇంకోటి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమా( Shakti Movie ) ఈ రెండు సినిమాల పైన వాళ్లు హెవీగా మనీ పెట్టేసి ఆతర్వాత నష్టాన్ని చవిచూశారు.
శక్తి సినిమా ఒక్కదాని మీదనే 25 కోట్ల నష్టం వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు గుణశేఖర్,మెహర్ రమేష్ ఇద్దరు కలిసి అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా ఉన్న వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies Banner ) ని ముంచేసారనే చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా కోల్పోయి ప్రొడ్యూసర్లు ఇలా అందకారంలోకి వెళ్ళిపోతున్నారు.
ఈమధ్య బయటకు వచ్చి తన అల్లుడు అయిన నాగ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి అనే సినిమా తీసి మళ్లీ సూపర్ హిట్ దక్కించుకున్నారు.
ప్రస్తుతం వీళ్ళ బ్యానర్ లోనే ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి అనే సినిమా చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు రేకెత్తుతున్నాయి.
మరో వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు.. సక్సెస్ సాధించడం పక్కా!