ఏపీ బీజేపీ ప్రకటనలకే పరిమితమా ?
TeluguStop.com
మొదటి నుంచి ఏ విధమైన వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నారో, అదే వైఖరితో ఇప్పటికీ ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారం ఉంది.
అప్పుడప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణం అయిపోయింది.
బీజేపీని బలోపేతం చేసే విషయంపైనా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విషయం పైన ఆ పార్టీ నాయకులు పెద్దగా దృష్టి సారించకపోవడం తో, ఆ పార్టీ గ్రాఫ్ ఏపీలో పెద్దగా కనిపించడం లేదు.
ఏపీ అధికార పార్టీ వైసిపి పై విమర్శలు చేయాలని ప్రతి సందర్భంలోనూ ప్రయత్నం చేస్తున్నా, కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే నాయకులు ఎక్కువగా స్పందిస్తూ, అదే పోరాటంగా భావిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో కి వచ్చి ఏపీలో వైసిపి ప్రభుత్వం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు , ప్రజల సమస్యల పైన పోరాటం చేసేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేయకపోవడం, మొదటి నుంచి ఏ వైఖరితో అయితే ఉన్నారో, ఇప్పటికీ అదే వైఖరితో ఇప్పటికి ఉంటూ వస్తుండడంతో, ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.
ఇక తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతంతో పోలిస్తే బాగా మెరుగైంది.హుజురాబాద్ ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఢీ కొట్టి విజయం సాధించింది.
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దులు విజయం సాధించేలా తెలంగాణ బీజేపీ నేతలు సమిష్టిగా కృషి చేశారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు రూపొందించడంతో పాటు, పాదయాత్ర నిర్వహించి బీజేపీ ని జనంలోకి తీసుకువెళ్ళారు.
కానీ ఏపీలో ఆ తరహా పరిస్థితులు కనిపించడం లేదు.బద్వేల్ నియోజకవర్గం లో బిజెపి పోటీ చేసింది తప్ప , పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
"""/"/
అసలు బలమైన అధికార పార్టీని ఢీకొట్టే స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించ లేకపోయింది.
అంతకుముందు జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ ఇదే విధమైన వ్యవహారంతో ఉండటంతోనే ఫలితాలు దారుణంగా వచ్చాయి.
ఏపీలో ఎన్నో సమస్యల పై బిజెపి నేతలు పోరాడేందుకు ఉన్నా, వాటిని పట్టించుకోకపోవడం, తిరుపతిలోని కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు ఏపీలో విగ్రహాలు ధ్వంసం వ్యవహారానికి నిరసనగా పాదయాత్ర చేపడతామని అప్పట్లో ప్రకటించారు .
"""/"/
కానీ దానిని వాయిదా వేసుకున్నారు. ఇక అమరావతి వ్యవహారం పైన ఇదే తీరు.
అమరావతి నుంచి బెజవాడ వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించి సైలెంట్ అయిపోయారు.
ఏపీలో బలపడేందుకు తెలంగాణలో రోల్ మోడల్ గా బీజేపీని ఏపీ నేతలు తీసుకుంటే ఫలితం కాస్త మెరుగ్గా ఉంటుంది తప్ప, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే ఎన్నికలను ఎదుర్కుంటాము అంటే ఏపీ లో బిజేపి ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మూవీ హిట్టైతే బాలయ్య ఖాతాలో అరుదైన ఘనత.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా?