ఆ అమ్మాయిలు బొమ్మలుగా మారారు.. లండన్‌లో వినూత్నరీతిలో నిరసన!
TeluguStop.com
లండన్ గ్యాలరీలో ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు చాలా వినూత్న రీతిలో వారి నిరసనను వ్యక్తం చేయగా, సోషల్ మీడియాలో అదికాస్త వైరల్ అవుతోంది.
శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఈ 'జస్ట్ స్టాప్ ఆయిల్' యాక్టివిస్టులు, లండన్ కోవెంట్ గార్డెన్‌లోని కోర్టౌల్డ్ గ్యాలరీలోని 'విన్సెంట్ వాన్ హోగ్' పెయింటింగ్ ఫ్రేమ్‌కు తమ చేతులను స్టిక్ చేసుకుని వినూత్నరీతిలో ప్రొటెస్ట్ చేయడం నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.
1889కి చెందిన ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ అర్లెస్‌లోని గ్రామీణ దృశ్యానికి ప్రతీక కాగా.
ఈ అందమైన ప్రాంతం త్వరలో కరువును ఎదుర్కోబోతోందని, అక్కడ వర్షపాత స్థాయిలు సగటు కంటే 45 శాతం తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
అందుకే, తమ నిరసనకు వేదికగా ఈ పెయింటింగ్‌ను ఎంచుకున్నట్లు ఆ యువతలు చెప్పడం అభినందనీయం.
వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ."చిన్నప్పుడు ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.
లండన్‌ను సందర్శించినప్పుడు మా నాన్న దీన్ని చూపించేందుకు నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు.నేను ఇప్పటికీ ఈ పెయింటింగ్‌ను ప్రేమిస్తున్నాను.
కానీ దీనికంటే ఎక్కువగా నా స్నేహితులు, కుటుంబం, ప్రకృతిని ప్రేమిస్తున్నాను.ప్రజాప్రతిష్ట కంటే భవిష్యత్తు మనుగడకు ఎక్కువ విలువ ఇస్తాను" అని అందులో ఒక యాక్టివిస్ట్ మాట్లాడింది.
ఇక మరో యాక్టివిస్ట్ మాట్లాడుతూ."UK ప్రభుత్వం కొత్తగా 40కి పైగా శిలాజ ఇంధన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనుంది.
సర్కార్ ఈ ప్రాజెక్ట్ ఆమోదించిందంటే.మన మరణ వారెంట్లపై సంతకం చేసినట్లే అవుతుంది!" అని తెలిపింది.
వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లను విరమించుకోవాలని, లేదంటే భవిష్యత్ తరాలు మంటకలిసిపోవడం ఖాయమని ఆ పర్యావరణ కార్యకర్తలు.
విచారం వ్యక్తం చేసారు.ఈ నేపథ్యంలో అన్ని కళాసంస్థలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మనల్ని మనమే కాపాడుకోవాలని, ఈ ప్రభుత్వాలు ఏమి చేయలేవని.వారి స్వలాభాలకోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు.
చూడండి ఎంత దారుణమో.. మహిళా పోలీస్‌పై దుండగుడి అరాచకం.. నెటిజన్లు ఫైర్..