వైసీపీలో ఆ న‌లుగురు క‌త్తిక‌ట్టారే… న్యాయం కోసం ర‌గులుతున్నారా ?

వైసీపీలో ఆ న‌లుగురు క‌త్తిక‌ట్టారే… న్యాయం కోసం ర‌గులుతున్నారా ?

అధికార వైసీపీలో న‌లుగురు నాయ‌కులు న‌లిగిపోతున్నారు.వారికి గుర్తింపు ఉందా?  లేదా?  అస‌లు జ‌గ‌న్ ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు?  ఆయ‌న ప‌ట్టించుకుంటున్నా.

వైసీపీలో ఆ న‌లుగురు క‌త్తిక‌ట్టారే… న్యాయం కోసం ర‌గులుతున్నారా ?

ప‌ట్టించుకోవాల‌ని అనుకున్నా.కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డు ప‌డుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వైసీపీలో ఆ న‌లుగురు క‌త్తిక‌ట్టారే… న్యాయం కోసం ర‌గులుతున్నారా ?

వీరిలో ప్ర‌ధానంగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఉంటే.మ‌రొక‌రు కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఇంకొక‌రు ప్ర‌కాశం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఉన్నారు.

వీరంతా కొన్ని ప‌ద‌వుల కోసం.కొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు.

అయితే.వీరంతా కూడా పార్టీ కోసం.

ప‌నిచేసివారు, జ‌గ‌న్‌పై అభిమానం ఉన్న‌వారే అయినా.కొన్ని శ‌క్తులు అడ్డుప‌డుతున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి.ఇటీవ‌ల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీని ప‌రుగులు పెట్టించే బాధ్య‌త‌లు తీసుకుని.

స‌క్సెస్ అయ్యారు.ప్ర‌స్తుతం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

అయితే.ఆయ‌న ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.

కానీ.ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు జ‌గ‌న్ నుంచి హామీ ల‌భించ‌లేదు.

ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఏకంగా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చినా.

ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు.ఈయ‌న కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.

ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం.వైసీపీలో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్న‌ప్ప‌టికీ.

జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. """/"/ ఇక‌, కృష్ణా జిల్లా నూజ‌వీడు ఎమ్మెల్యే వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు.

కూడా ప‌ద‌విని కోరుకుంటున్నారు.ఆయ‌న వ‌రుస‌గా ఇక్క‌డ విజ‌యం సాధించారు.

పైగా టీడీపీకి అడ్ర‌స్ గ‌ల్లంతు చేయ‌డంలోనూ ఈయ‌న ప్ర‌ముఖ పాత్ర పోషించారు.వైసీపీకి బ‌ల‌మైన పునాదులు ఏర్ప‌డేలా చేశారు.

ఈయ‌న మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు.ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌కు కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.ఇక‌, ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ నుంచి విర‌మించుకున్న బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు.

అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుకి ఆయ‌న‌కు మ‌ధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

అయితే.త‌న‌కు కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని.

ఆయ‌న ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు.అయితే.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న విష‌యంలోనూ జ‌గ‌న్ దృష్టి పెట్ట‌లేదు.మొత్తంగా ఈ న‌లుగురు ఇప్ప‌టికిప్పుడు త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్న వారి జాబితాలో ముందు వ‌రుస‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.వీరిని ప‌ట్టించుకునే తీరిక‌.

జ‌గ‌న్‌కు ఎక్క‌డా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆ రీజన్ వల్లే సౌత్ సినిమాలు హిట్ అవుతున్నాయి.. అదుర్స్ నటుడు షాకింగ్ కామెంట్స్ వైరల్!