ఆనందంగా గడపాలంటే ప్రపంచంలోని ఆ 5 ఉత్తమ నగరాలు వెళ్లాల్సిందే!

ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణం, నగర జీవనంలో స్థిరత్వంతో పాటు విద్య, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయనే అంశాల ప్రాతిపదికన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన గ్లోబల్ లివబుల్ ఇండెక్స్( Global Liveable Index ) ప్రకారం చూసుకుంటే నేటి మనిషి సగటు జీవన ప్రమాణం 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో వారు ప్రపంచంలోని 173 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించారు.జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఘనత ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు చెందుతుంది.

ఆయా దేశాల్లో విద్య, వైద్య ప్రమాణాలు మెరుగవడం వల్లే ఇది సాధ్యమైందని చాలా స్పష్టంగా తెలుస్తోంది.

మెరుగైన జీవనం సాగించేందుకు ఏ నగరం అనువైనదో తెలుసుకునేందుకు ఆయా నగరాల్లో నివసిస్తున్న వారి నుంచి సేకరించిన సమాచారం, అనుభవాలతోనే ఈ నివేదిక రూపొందించినట్లు సమాచారం.

"""/" / ఈ క్రమంలో మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో ఆస్ట్రియా( Austria ) రాజధాని వియన్నా అగ్ర స్థానాన్ని అధిరోహించింది.

సదరు జాబితాలో 2021లో వియన్నాకు చోటు దక్కించుకుంది.ఆ తరువాత మరలా ఇప్పుడు తాజాగా మరలా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

మనిషి హాయిగా జీవనం కొనసాగించడానికి ఆ నగర చరిత్ర, నమ్మకమైన రవాణా వ్యవస్థ, వైద్యం, వుద్యోగం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఆ తరువాత ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ వరుసగా 3, 4 స్థానాలు దక్కించుకోవడం విశేషం.

సంస్కతి, పర్యావరణం విభాగాల్లో మెల్‌బోర్న్ ( Melbourne )మెరుగ్గా ఉంది.ఇక కెనడాలోని వాంకోవర్, కాల్గరి, టొరంటో నగరాలు టాప్ 10 జాబితాలో దక్కించుకోవడం చాలా విశేషంగా చెప్పకోవచ్చు.

అక్కడి సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల వాంకోవర్ సిటీ తొలి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకుంది.

అక్కడి ప్రజలు నగరాన్ని ప్రేమించేందుకు కూడా అవే కారణం. """/" / ఇకపోతే, ఉత్తమ నగరాల జాబితాలో ఆసియా నుంచి జపాన్‌లోని( Japan ) ఒసాకాకి మాత్రమే టాప్ 10లో చోటు దక్కడం కొసమెరుపు.

స్థిరత్వం, విద్య, వైద్యంలో వంద శాతం మార్కులు సాధించినా పదో స్థానంలో నిలిచింది.

ప్రపంచమంతా ద్రవ్యోల్బణం సమస్య ఎదుర్కొంటున్నా ఒసాకాలో మాత్రం నేడు ధరలు అందుబాటులో ఉండడం విశేషం.

ద్రవ్యోల్బణం ప్రభావం అంతగా లేకపోవడంపై అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు.ఒసాకాతో పాటు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ కూడా పదో స్థానాన్ని పదిలం చేసుకొంది.

ఈ నగరం నిరుడు 25వ స్థానంలో ఉంది.కరోనా తర్వాత కూడా 2022 సెప్టెంబర్ వరకూ అక్కడ ఆంక్షలు అమల్లో ఉండడమే అందుకు ప్రధాన కారణం.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?