అందుకే మొదట్లో మా ఆయనతో పెళ్ళికి ఒప్పుకోలేదు.. కానీ….

తెలుగులో ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహించిన "తొలిప్రేమ" అనే  చిత్రం ఇప్పటికీ ప్రేక్షలకులకి బాగా గుర్తుంటుంది.

 అంతేగాక ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ జాబితాలో ఉంటాయి.

 అయితే ఈ చిత్రంలో టాలీవుడ్  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా, వర్తమాన నటి కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లతో పాటు హీరో చెల్లెలి పాత్రలో నటించిన "వాసుకీ ఆనంద్" కూడా బాగా ఫేమస్ అయింది.

అయితే ఏమైందో ఏమోగాని వాసుకీ ఆనంద్ ఈ చిత్రంలో నటించిన తర్వాత పూర్తిగా సినిమాలలో నటించడం మానేసింది.

ఆ తర్వాత ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాజాగా వాసుకీ ఆనంద్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన కూతురు "హర్షిత ఆనంద్"  తో కలిసి పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకుంది.

ఇందులో భాగంగా తన వ్యక్తిగత కారణాల వల్లే తొలి ప్రేమ చిత్రంలో నటించిన తర్వాత సినిమాల్లో నటించ లేదని స్పష్టం చేసింది.

అంతేగాక ఆ చిత్రంలో నటించిన తర్వాత తెలుగు ప్రముఖ "ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి" తో పెళ్లవడంతో కుటుంబ బాధ్యతలను కూడా మోయాల్సి వచ్చిందని అందువల్లనే ఉద్యోగం చేశానని తెలిపింది.

 అయితే ఈ మధ్య కాలంలో తాను కొంచెం ఫ్రీ అయ్యానని దాంతో సినిమాల్లో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అయితే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే మాత్రమే నటిస్తానని కూడా స్పష్టం చేసింది.

అయితే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని కానీ ఎక్కడా కృంగి పోకుండా లైఫ్ లీడ్ చేశామని చెప్పుకొచ్చింది.

"""/"/ తమ పెళ్లి ఎలా జరిగిందనే విషయం పై స్పందిస్తూ తనకి ఆనంద్ సాయి ని పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో పరిచయం చేశాడని ఆ పరిచయం కాస్త పరిణయంకి దారి తీసిందని చెప్పుకొచ్చింది.

అయితే తనకి పరిచయమైన మొదట్లో ఆనంద్ పెద్దగా మాట్లాడేవాడు కాదని కానీ మెల్ల మెల్లగా ప్రేమ మొదలైన తర్వాతనే ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడం మొదలు పెట్టామని కూడా చెప్పుకొచ్చింది.

అంతేగాక ఆనంద్ సాయి మొదటగా  తనని పెళ్లి చేసుకుంటావా.? అని డైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడని అంతే తప్ప ఎప్పుడూ కూడా "ఐ లవ్ యు" మాత్రం చెప్పలేదని తెలిపింది.

అయితే మొదట్లో తాను భయపడి అంగీకరించలేదని కానీ తర్వాత తన మనసు గురించి తెలియడంతో ఓకే చెప్పానని కూడా తన మనసులో మాటని చెప్పుకొచ్చింది.

ఒక రకంగా చెప్పాలంటే తమ మధ్య  ప్రేమ చిగురించడానికి పవన్ కళ్యాణ్ కారణమని కూడా తెలిపింది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?