బిగ్‌బాస్‌ 3 : ఈ వారం రవి ఎలిమినేట్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఎలిమినేషన్‌ ఎవరు కాబోతున్నారో ముందు రోజే తేలిపోతుంది.

శనివారం రెండు రోజుల షూట్‌ జరుగుతున్న కారణంగా ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేషన్‌ జరుగబోతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఈ వారం కూడా ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.రవి ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లబోతున్నాడు.

బిగ్‌బాస్‌ 3 లో మంచోడు అనే ట్యాగ్‌తో మొదటి నుండి కూడా ఎంటర్‌టైన్‌ చేసిన రవి ఇప్పుడు ఎలిమినేట్‌ అయ్యాడు.

"""/"/ """/"/    నిన్నటి ఎపిసోడ్‌లో బాబా బాస్కర్‌ మరియు వరుణ్‌ సందేశ్‌లపై నాగార్జున తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

వితికకు కూడా కౌంటర్‌ ఇచ్చాడు.శ్రీముఖి గురించి బాబా భాస్కర్‌ చేసిన కామెంట్స్‌ వీడియోను చూపించిన నాగార్జున ఆయనకు ఇదేం పద్దతి అంటూ సీరియస్‌గానే క్లాస్‌ పీకాడు.

ఈవారం శ్రీముఖి కెప్టెన్‌ అయిన కారణంగా ఆమెను నాగార్జున అభినందించడంతో పాటు, ఆమె టాస్క్‌లో బాగా చేసినట్లుగా అభినందించాడు.

"""/"/ """/"/   బిగ్‌బాస్‌ సీజన్‌ 3 రేటింగ్‌ సరిగా రావడం లేదు అంటూ మొదటి నుండి వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశ్యంతో కాస్త సీరియస్‌గానే గేమ్‌ను టర్న్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రవి ఎలిమినేట్‌ అవ్వడంతో ఈ వారం గేమ్‌ మరింత సీరియస్‌కు వచ్చింది.నేడు ఎపిసోడ్‌లో రవి ఎలిమినేట్‌ అవ్వడం చూపించడంతో పాటు, మరేం ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు చూపిస్తారో చూడాలి.

షోకు ఎంతగా వివాదాలను కట్టబెట్టినా, గేమ్‌ చాలా లేజీగా సాగుతుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

అందుకే షోకు మంచి టీఆర్పీ రేటింగ్‌ రావడం లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే16, గురువారం2024