ఈ సంవత్సరం జంట శ్రావణాలు.. మంగళవారలు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే..!

శ్రావణమాసం( Sravanamasam ) పూజలను, శుభకార్యాలను జరుపుకునే పవిత్ర మాసమని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో మహిళలు మంగళ గౌరీవ్రతాన్ని, శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ముఖ్యంగా శివుడు ఈ నెలలో సముద్రంలో పుట్టిన హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచి గరళకంఠుడిగా మారిన నెల అని భక్తులు విశ్వసిస్తారు.

కాబట్టి ఈ నెలలో శివునికి( Lord Shiva ) ప్రత్యేక పూజలను చేస్తే అనుగ్రహం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అయితే ఈ మాసంలో శివుడి రుద్రావతారంగా భావించే హనుమంతునీ పూజకు కూడా ఎంతో విశిష్ట స్థానం ఉంది.

"""/" / హిందూ విశ్వాసం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే మంగళవారం రోజున ఎవరైనా శివునితో పాటు హనుమంతుని కూడా పూజిస్తే అతని కోరికలు అన్నీ తీరుతాయని ప్రజలు నమ్ముతారు.

శ్రావణమాసంలో మంగళవారాలలో చేసే హనుమంతుడి పూజ( Hanuman Puja ) మతపరమైన ప్రాముఖ్యత, దానికి సంబంధించిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం శ్రావణమాసంలో సంకట మోచన హనుమంతుడిని ఆరాధించడం వలన సాధకుల బాధలు దూరమైపోతాయి.

అలాగే శివుడితో పాటు హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితంలో ఎలాంటి భయం ఉండదు.

"""/" / అలాగే హనుమంతుడు ప్రతి యుగంలో ఉన్నాడు.తన భక్తులను రక్షించడానికి ఒక పిలుపుతో పరిగెత్తుకొని వస్తాడని ప్రజలు నమ్ముతారు.

కాబట్టి శ్రావణమాసంలో మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు.

అయితే ఈ సంవత్సరం జంట శ్రావణమాసాలు వచ్చాయి.కాబట్టి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం జులై 18 వ తేదీ మంగళవారం మొదలై ఆగస్టు 16వ తేదీ బుధవారం రోజు ముగుస్తుంది.

అలాగే నిజ శ్రావణమాసం ఆగస్టు 15వ తేదీ గురువారం మొదలై సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం ముగుస్తుంది.

వావ్, అచ్చం మనుషుల్లాగానే మాట్లాడుతున్న కుక్కలు.. ఈ వీడియో చూస్తే..