ఈ సంవత్సరం దీపావళి సందడంతా ఓటీటీలదే..!

ఈ సంవత్సరం దీపావళి సందడంతా ఓటీటీలదే!

దసరా, దీపావళి పండుగకు భారతదేశంలో ఉన్న చిత్రపరిశ్రమలో ఖచ్చితంగా ఎన్నో కొన్ని చిన్న లేదా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.

ఈ సంవత్సరం దీపావళి సందడంతా ఓటీటీలదే!

అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని అన్ లాక్ విధానంలో భాగంగా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చినా కానీ తెలుగులో ఒక సినిమా కూడా థియేటర్లోకి అడుగు పెట్టలేదు.

ఈ సంవత్సరం దీపావళి సందడంతా ఓటీటీలదే!

దీంతో ఎన్నో సినిమాలు ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో దర్శనమిస్తున్నాయి.చిన్న సినిమాలకు మాత్రం పూర్తిగా ఇప్పుడు ఓటీటీలే దిక్కుగా మారాయి.

ఇక బుధవారం నాడు కీర్తి సురేష్ బిజినెస్ ఉమెన్ గా నటించిన మిస్ ఇండియా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఎంతో మంది ప్రముఖులు నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

అలాగే తమిళ్ హీరో సూర్య నటించిన సూరారై పొట్రు.అదే తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో అమెజాన్ ప్రైమ్ ద్వారా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను అతి తక్కువ ధరకే ప్రతి సామాన్యుడు విమానంలో ప్రయాణించాలని ఓ యువకుడు కన్న కలలు అన్న కధాంశంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి సినిమా నవంబర్ 12న హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా ద్వారా ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ మొట్టమొదటిసారిగా బాలీవుడ్ లో దర్శకత్వం వహిస్తున్నారు.

కరోనా వైరస్ తీవ్రత తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా ఇదే కావడం విశేషం.

ఇక అలాగే నవంబర్ 14న హాట్ స్టార్ లో నయనతార దేవతగా నటించిన అమ్మోరు తల్లి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వీటితోపాటు మరి కొన్ని బాలీవుడ్ సినిమాలు ఓటిటి ఫ్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి.

ప్రతిసారి దసరా, దీపావళి పండగలకు సినిమా హాల్లో కిక్కిరిసిపోతుంది పరిస్థితులను ఇప్పుడు అందరూ ఫ్లాట్ఫామ్ కు వెళ్ళడం గమనిస్తూనే ఉన్నాం.

కాబట్టి ఈసారి దీపావళి సందడి అంతా ఓటీటీ లోనే కనపడుతుంది.

ఏపీలో పదో తరగతి టాపర్ కు ఎకరం పొలం.. కలెక్టర్ చేసిన సాయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!