మీది షార్ట్ హెయిరా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పొడుగ్గా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది.కానీ కొందరి జుట్టు మాత్రం షార్ట్ గా ఉంటుంది.

షార్ట్ హెయిర్( Short Hair ) కలిగిన వారు లాంగ్ హెయిర్ వారిని చూసి అసూయ పడటం చాలా కామన్.

మీది కూడా షార్ట్ హెయిరా.? అయితే అస్సలు వర్రీ అవకండి.

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ గురించి కనుక తెలుసుకుంటే మీ షార్ట్ హెయిర్ ను కొద్ది రోజుల్లోనే లాంగ్ గా మార్చుకోవచ్చు.

మిమ్మల్ని చూసి ఇతరులు అసూయ పడేలా చేయవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక చిన్న క్యారెట్ తీసుకుని సన్నగా తురుముకోవాలి.క్యారెట్ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో బాగా పడిన ఒక అరటి పండును ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు( Curd ) మరియు ఒక చిన్న కప్పు క్యారెట్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు.

‌క్యారెట్‌లో విటమిన్ ఎ మరియు బయోటిన్ ఉంటాయి.ఇవి హెయిర్ గ్రోత్ ను ప్రోత్స‌హిస్తాయి.

జుట్టు పొడుగ్గా పెరిగేందుకు తోడ్ప‌డ‌తాయి.అలాగే అరటిపండ్లలో పొటాషియం( Potassium ) మెండు ఉంటుంది.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.

అర‌టి పండు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మే కాకుండా జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.

"""/" / ఇక పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్.క్యాల్షియం, ప్రొటీన్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోష‌కాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టును మృదువుగా చేస్తుంది.

మరియు జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.ఫైనల్ గా వారానికి ఒకసారి ఇప్పుడు మాస్క్ ను వేసుకోవడం వల్ల షార్ట్ గా ఉన్న మీ జుట్టు కొద్దిరోజుల్లోనే పొడుగ్గా పెరుగుతుంది.

ఒత్తుగా తయారవుతుంది.ఆరోగ్యమైన కురులు మీ సొంతం అవుతాయి.