20వ సారి గర్బం, 17వ సారి ప్రసవం

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ సమీపంలో ఉండే కేశపురి ప్రాంతంలో నివాసం ఉంటున్న సంచార జాతికి చెందిన 38 ఏళ్ల లంకాబాయి 20వ సారి గర్బం దాల్చింది.

గత 19 సార్లలో ఒక్కసారి కూడా ఆమె హాస్పిటల్‌ గడప తొక్కలేదు.గతంలో 19 సార్లు ఆమె గర్బం దాల్చగా మూడు సార్లు నాలుగు అయిదు నెలల సమయంలో అబార్షన్‌ అయ్యిందట.

ఇక 16 సార్లు ఆమె ప్రసవించింది.ఆ 16 మందిలో అయిదుగురు పుట్టిన కొన్ని గంటలకు లేదా రోజుల్లో మృతి చెందారు.

దాంతో ప్రస్తుతం ఆమె సంతానం 11 మంది.తాజాగా ఇప్పుడు ఆమె మరోసారి గర్బం దాల్చడంతో ఆమె సంతానం డజనుకు చేరబోతుంది.

గతంలో 19 సార్లు హాస్పిటల్‌కు వెళ్లని ఆమె ఈసారి మాత్రం చుట్టుపక్కల వారి బలవంతంతో హాస్పిటల్‌కు వెళ్లింది.

19 సార్లు గర్బం దాల్చడం వల్ల ఆమె గర్బ సంచి లూజ్‌గా అయ్యిందని, అందుకే ఆమె డెలవరీ సమయంలో అధికంగా బ్లీడింగ్‌ అవ్వడంతో పాటు, ఎక్కువగా ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైధ్యులు అన్నారు.కడుపులో ఉన్న పిండం కూడా బాగానే ఉందని వైధ్యులు స్కానింగ్‌ చేసి నిర్ధారించారు.

ఈసారి డెలవరీ తర్వాత భవిష్యత్తులో గర్బం రాకుండా ఆమెను ఒప్పించి ఆపరేషన్‌ చేసే ఉద్దేశ్యంలో డాక్టర్లు ఉన్నారు.

ఇన్ని సార్లు గర్బం దాల్చడం చాలా అరుదైన సంఘటనగా వైధ్యులు చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..!!