ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న క్రేజీ సినిమాల వివరాలు ఇవే!
TeluguStop.com
మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చిన్న సినిమాలపై మాత్రమే అందరి దృష్టి ఉంది.ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో రాజు యాదవ్( Raju Yadav ) ఒకటి.
గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేశారని సమాచారం అందుతోంది.ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు కృష్ణమాచారి.కె.
దర్శకత్వం వహించారు.అశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ మూవీ( Love Me Movie ) ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.
కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.హీరో దెయ్యాన్ని లవ్ చేయడమనే వింత కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
ఈ నెల 24వ తేదీన డర్టీ ఫెలో( Dirty Fellow Movie ) అనే చిన్న సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది.
"""/" /
యాక్షన్, అడ్వెంచర్ సినిమాలను టార్గెట్ చేస్తూ ఈ నెల 23న ప్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా( Furiosa A Mad Max Saga ) విడుదల కానుందని సమాచారం.
తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్( Toughest Forces On Earth ) అనే డాక్యుమెంటరీ సిరీస్ ఈ నెల 22న స్ట్రీమింగ్ కానుండగా అట్లాస్( Atlas ) హాలీవుడ్ మే నెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
మే 24న నెట్ ఫ్లిక్స్ లో క్రూ( Crew ) అనే మరో హిందీ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్టు భోగట్టా.
"""/" /
అమెజాన్ ప్రైమ్ లో మే నెల 23వ తేదీన ద టెస్ట్ 3 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
జీ5 ఓటీటీలో వీర్ సావర్కర్( Veer Savarkar ) ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని భోగట్టా.
హాట్ స్టార్ లో ఈ నెల 23న ది కర్దాషియన్స్( The Kardashians ) స్ట్రీమింగ్ కానుండగా ఈ నెల 24న ద బీచ్ బాయ్స్ అనే డాక్యుమెంటరీ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
జియో సినిమాలో ఈ నెల 21 నుంచి అక్వామెన్( Aquaman ) తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుండగా అదే తేదీన డ్యూన్ 2 హాలీవుడ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
యాపిల్ టీవీ ప్లస్ లో మే 22న ట్రెయింగ్ 4 వెబ్ సిరీస్, లయన్స్ గేట్ ప్లే, మే24న వాంటెడ్ మాన్ హాలీవుడ్ స్ట్రీమింగ్ కానుంది.
H2ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List ) /h2
Table "tstoptable" Tr "tstoptable-header" ThMovie Name/th ThRelease Date/th ThOnline Streaming Partner/th /tr Tr "tstoptable-row" Tdప్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా /td Tdమే 23 /td Tdనెట్ఫ్లిక్స్ /td /tr Tr "tstoptable-row" Tdటఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ /td Tdమే 22 /td Tdనెట్ఫ్లిక్స్ /td /tr Tr "tstoptable-row" Tdఅట్లాస్ /td Tdమే 24 /td Tdనెట్ఫ్లిక్స్ /td /tr Tr "tstoptable-row" Tdద టెస్ట్ 3 /td Tdమే 23 /td Tdఅమెజాన్ ప్రైమ్/td /tr Tr "tstoptable-row" Tdవీర్ సావర్కర్ /td Tdమే 24 /td Tdజీ5/td /tr Tr "tstoptable-row" Tdది కర్దాషియన్స్ /td Tdమే 23 /td Tdహాట్ స్టార్/td /tr Tr "tstoptable-row" Tdద బీచ్ బాయ్స్ /td Tdమే 24 /td Tdహాట్ స్టార్/td /tr Tr "tstoptable-row" Tdఅక్వామెన్ /td Tdమే 21 /td Tdజియో సినిమా/td /tr Tr "tstoptable-row" Tdడ్యూన్ 2/td Tdమే 21 /td Tdజియో సినిమా/td /tr Tr "tstoptable-row" Tdట్రెయింగ్ 4 /td Tdమే 22 /td Tdయాపిల్ టీవీ ప్లస్/td /tr Tr "tstoptable-row" Tdలయన్స్ గేట్ ప్లే/td Tdమే 22 /td Tdయాపిల్ టీవీ ప్లస్/td /tr Tr "tstoptable-row" Tdవాంటెడ్ మాన్ హాలీవుడ్ /td Tdమే 24 /td Tdయాపిల్ టీవీ ప్లస్/td /tr
/table
.