ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే!

గత వారం థియేటర్లలో విడుదలైన మహారాజ, హరోంహర సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయని సమాచారం అందుతోంది.ఈ నెల 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ కానుండటం ఈ వారం మరీ ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కావడం లేదు.

వరుణ్ సందేశ్ నటించిన నింద( Nindha Movie ) ఈ నెల 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో ఓ.ఎమ్.

జీ( OMG Movie ) పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కూడా 21న రిలీజ్ కానుంది.చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ( Honeymoon Express ) సైతం ఈ నెల 21న రిలీజ్ కానుంది.

ఈ వారం థియేటర్లలో ఈ మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. """/" / ఓటీటీల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 20 నుంచి కోటా ఫ్యాక్టరీ 3( Kota Factory 3 ) స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న బాక్ మూవీ( Baak Movie ) ఈ నెల 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 18 నుంచి ఏజెంట్ ఆఫ్ మిస్టరీ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా అదే తేదీన అవుట్ స్టాండింగ్ అనే హాలీవుడ్ సిరీస్ సైతం స్ట్రీమింగ్ కానుంది.

"""/" / మహరాజ్ హిందీ సిరీస్ ఈ నెల 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.

అమెరికాస్ స్వీట్ హార్ట్స్( Americas Sweet Hearts ) వెబ్ సిరీస్ ఈ నెల 20న స్ట్రీమింగ్ కానుండగా జూన్ 21న నడిగర్ మలయాళం వెర్షన్, ట్రిగ్గర్ వార్నింగ్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 21న బ్యాడ్ కాప్( Bad Cop ) హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమాలో ది హోల్డోవర్స్ ఇంగ్లీష్ వెర్షన్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

"""/" / ఈ నెల 17 నుంచి హౌస్ ఆఫ్ ది డ్రాగన్2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

జూన్ 19వ తేదీ నుంచి ఇండస్ట్రీ వెబ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

బిగ్ బాస్3 ఓటీటీ ఈ నెల 21వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

వైరల్ వీడియో: అజిత్ ధైర్యానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.. సినిమా కోసం ప్రాణాలనే పణంగా పెట్టి..?