ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో ప్రేక్షకులను అలరించే సినిమాలు, సిరీస్ లు ఇవే!

ఆగష్టు నెల( August ) చివరి వారంలో థియేటర్లు, ఓటీటీలలో అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలలో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

వరుణ్ కు జోడీగా సాక్షి వైద్య ఈ సినిమాలో నటించగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త( King Of Kotha ) ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఆగష్టు 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా గాండీవధారి అర్జున ఆగష్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

కార్తికేయ, నేహాశెట్టి కాంబోలో తెరకెక్కిన బెదురులంక 2012,( Bedurulanka 2012 ) విజయ్ రాజ్ కుమార్ నేహా పటాని జంటగా నటించిన ఏం చేస్తున్నావ్ 25వ తేదీన కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హాస్టల్ హుడుగారు బేకగిద్దరే డబ్బింగ్ వెర్షన్ బాయ్స్ హాస్టల్( Boys Hostel ) 26వ తేదీన రిలీజ్ కానున్నాయి.

"""/" / ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో బ్రో ( Bro Movie ) ఆహా ఓటీటీలో బేబీ( Baby ) స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈ సినిమాలు ఓటీటీలో కూడా సక్సెస్ సాధిస్తాయని అభిమానులు భావిస్తున్నారు ఈ రెండు సినిమాలు 25వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 24న రగ్నరోక్ వెబ్ సిరీస్, ఆగష్టు 25న కిల్లర్ బుక్ క్లబ్ హాలీవుడ్ సిరీస్, అదే తేదీన లిఫ్ట్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతాయి.

"""/" / డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగష్టు 25వ తేదీన అఖ్రి సోచ్( Aakhri Sach ) అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

బుక్ మై షోలో ఆగష్టు 21వ తేదీన సమ్ వేర్ ఇన్ క్వీన్స్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా ఆగష్టు 25న లయన్స్ గేట్ ప్లే, ఎబౌట్ మై ఫాదర్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

జియో సినిమాలో ఆగష్టు 21న లఖన్ లీలా భార్గవ స్ట్రీమింగ్ కానుండగా ఆగష్టు 25న బజావ్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

యాపిల్ టీవీ ప్లస్ లో ఈ నెల 23న ఇన్వాజిన్2 స్ట్రీమింగ్ అవుతుంది.

అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?