బ్రిటన్‌లోని ఈ గ్రామం నిండా దెయ్యాలే..??

ఇంగ్లాండ్ దేశంలో చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి కానీ ఒక మొత్తం ఊరిలో దెయ్యాలు ఉన్నాయనే మాట ఎప్పుడైనా విన్నారా? కానీ బ్రిటన్‌లో( Britain ) అలాంటి గ్రామం ఒకటి ఉంది.

దాని పేరు ప్లక్లీ( Pluckley ).ఈ గ్రామం లండన్‌కు 100 కంటే తక్కువ కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

చూడటానికి అది సాధారణమైన, నిశ్శబ్ద గ్రామంగా కనిపించినా, దాని చరిత్ర భయంకరంగా, వింతగానూ ఉంటుంది.

బ్రిటన్‌లో మోస్ట్ హంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచిన ప్లక్లీ, 1989లో అత్యధిక సంఖ్యలో దెయ్యాలను చూసిన ప్రదేశాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందింది.

"""/" / ఈ గ్రామంలో దారుణమైన హత్యలు, దెయ్యాల అనుభవాల చరిత్ర ఎన్నో ఉన్నాయి.

15వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఇక్కడే కొన్ని డేరింగ్ కుటుంబాలను నివసించాయి వాళ్లే దెయ్యాలయ్యి ఈ ఊరిని పట్టిపీడిస్తున్నారు అని చాలామంది నమ్ముతారు.

ప్లక్లీలో మోస్ట్ హంటెడ్ ప్లేస్‌ల్లో ఒకటి సెయింట్ నికోలస్ చర్చి( St.Nicholas Church ).

చర్చి లోపల చావడి ( Chapel ) అంతస్తు కింద నుంచి వింత కాంతులు వెలువడటం, కొట్టే శబ్దాలు వినిపించడం వంటి అనుభవాలు జరిగాయని ప్రజలు చెబుతున్నారు.

డేరింగ్ కుటుంబానికి చెందిన చాలా మంది సభ్యుల మృతదేహాలను ఈ చావడి అంతస్తు కిందే ఖననం చేశారని కొందరు నమ్ముతున్నారు.

"""/" / ప్లక్లీలో దెయ్యాలు ఉన్నట్లు చెబుతున్న ప్రదేశాలలో రోజ్ కోర్ట్ ఒకటి.

స్థానిక కథనాల ప్రకారం, డేరింగ్ కుటుంబంలోని వ్యక్తి తన ప్రేమించిన మహిళ కోసం రోజ్ కోర్ట్‌ను నిర్మించాడు.

ఆమె ఓ సన్యాసిని ప్రేమించి, అతనితో ఉండలేక, గుండెలు పగిలి విషం తాగి చనిపోయింది.

ఆమె ఆత్మ రాత్రిపూట రోజ్ కోర్ట్‌లో ఉంటుందని, భయంకరమైన ఆక్రోశాలు, మూలుగులు వినిపిస్తాయని చెబుతారు.

ఆమె ప్రేమించిన సన్యాసి కూడా ఈ ప్రాంతాన్ని తనకు నివాసంగా చేసుకున్నాడని నమ్ముతారు.

అతని ఆత్మ గ్రేస్టోన్స్ దగ్గర తిరుగుతూ, భవనం చుట్టూ కనిపించి మాయమవుతూ ఉంటుందని చెపుతారు.

గ్రామంలోని పాత పబ్‌లో కూడా దెయ్యాలు ఉన్నాయని అంటారు.19వ శతాబ్దానికి చెందిన ఒక మహిళ ఆత్మ పబ్‌లోని టేబుల్ వద్ద కూర్చుని కనిపించిందని చాలామంది చెప్పారు.

ఆమె అదృశ్యమయ్యే వరకు చాలా మంది సందర్శకులు ఆమెను నిజమైన వ్యక్తి అని పొరపాటు పడతారట.

ఏదేమైనా ఇక్కడ ఇన్ని దయ్యాలు ఉన్నాయని ప్రజలు చెప్పడం నిజంగా షాకింగ్‌లా అనిపిస్తోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!