ఈ ముడుపు తిరుమల హుండీలో వేస్తె వచ్చే మంచి ఫలితం ఇదే!

కలియుగ దైవంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు.

స్వామి వారు భక్తుల కోరికలను తీరుస్తూ వారికి కొంగుబంగారం చేయడంతో స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని వారి కోరికలను ముడుపులను చెల్లిస్తుంటారు.

తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని వడ్డికాసులవాడ ని, గోవిందుడని శ్రీహరి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తాము.

పురాణాల ప్రకారం లోక కల్యాణం కోసం స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని తన వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అని చెబుతాము.

ఇలా స్వామివారు ఈ కలియుగం అంతమయ్యేవరకు కుబేరుడికి అప్పు తీర్చలేదని వడ్డీ మాత్రమే చెల్లిస్తుంటారు అని భావిస్తారు.

ఇక స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి ముడుపులను చెల్లిస్తుంటారు.

ఈ క్రమంలోనే స్వామివారి హుండీలో వేసే ధనాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు.ఇందులో మొదటిది నిష్కామ పుణ్య ధనం అంటే ఏ కోరిక లేకుండా హుండీలో భక్తులు వేసే ముడుపును నిష్కామ పుణ్య ధనం అంటాము.

ఇలాంటి డబ్బును మాత్రమే స్వామివారు కుబేరుడికి అప్పుగా చెల్లిస్తారని చెబుతారు.అదేవిధంగా రెండవ భాగాన్ని పుణ్య ధనం అని పిలుస్తారు.

ఇలాంటి ధనాన్ని భక్తులు ఏదైనా కోరికలు కోరి వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి చెల్లించే ధనం లేదా నగలను పుణ్య దానం అంటారు.

ఇలాంటి సొమ్మును ఆలయంలో అన్నదానానికి విద్య వైద్యం కోసం ఉపయోగిస్తారు.ఇలాంటి ధనం వల్ల భక్తులు చేసిన పాపాలు తొలగిపోతాయి.

"""/" / మూడవది అన్యాయపు సొమ్ము.ఎవరైనా అన్యాయంగా సంపాదించిన సొమ్మును స్వామి వారి పేరిట ముడుపులు చెల్లించి హుండీలో వేస్తుంటారు.

అయితే ఇలాంటి వారి పాపాలు కొన్ని తరాల తరువాత తొలగిపోతాయి.కనుక మనం కోరిన కోరికలు నెరవేరిన తరువాత స్వామివారి హుండీలో వేసే కానుకల వల్ల మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పవచ్చు.

కాకినాడ సభలో పవన్ పై సీఎం జగన్ సెటైర్లు..!!