వర్షాకాలంలో చుండ్రు మరింత ఎక్కువైందా? అయితే ఈ రెమెడీ మీకోసమే!
TeluguStop.com
చుండ్రు.ప్రధానంగా వేధించే జుట్టు సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో చుండ్రు మరింత ఎక్కువైపోయి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది.పైగా చుండ్రు వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్, మొటిమలు వంటి సమస్యలు సైతం తలెత్తుతాయి.
అందుకే చుండ్రును నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా క్రమంగా వదిలిపోతుంది.
మరి చుండ్రును తరిమికొట్టే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత.
ఒకటిన్నర టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడర్‌ను వేయాలి.ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన తర్వాత పల్చటి వస్త్రం సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌ను తలతో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్‌ను ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది.అదే సమయంలో హెయిర్ ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.
సో.తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.
మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఈమె కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!