ఈ ఆయిల్‌ను రాసుకుంటే ముడ‌త‌లు అన్న మాటే అన‌రు!

చ‌ర్మంపై ముడ‌త‌లు ప‌డ్డాయంటే చాలు.ఏదో తెలియ‌ని అందోళ‌న మ‌న‌సులో పురుడు పూసుకుంటుంది.

ఎందుకంటే, ముడ‌త‌లు ముస‌లిత‌నానికి సంకేతం.అందులోనూ చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌లు వ‌స్తే.

ఇక వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం అనే చెప్పాలి.వ‌య‌సు పైబ‌డ‌టం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, హార్మోన్ ఛేంజ‌స్‌, శ‌రీర బ‌రువులో వ‌చ్చే మార్పులు, స‌న్ స్క్రీన్ లేకుండా ఎండ‌ల్లోకి వెళ్ల‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు వస్తుంటాయి.

దాంతో ఆ ముడ‌త‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం ఏవేవో క్రీమ్స్‌, సీర‌మ్స్‌, లోష‌న్స్ వాడుతుంటారు.

ర‌క‌ర‌కాల ఫేస్ ప్యాకులు, మాస్కులు వేసుకుంటారు.అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మ‌ద‌న ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌ను రాసుకుంటే ముడ‌త‌లు అన్న మాటే అన‌రు.మ‌రి లేటెందుకు ఆ ఆయిల్ ఏంటో, ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఐదారు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా తుంచుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తుంచి పెట్టుకున్న బిర్యానీ ఆకులు, ఇర‌వై యాల‌కులు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు ఎక్ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ మ‌రియు బిర్యానీ ఆకు-యాల‌కుల పొడి వేసి చిన్న మంట‌పై ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

"""/"/ ఆపై స్ట‌వ్ ఆఫ్‌ చేసి చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన వెంటనే స్ట్రైన‌ర్ సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్‌ను ఒక బాటిల్‌లో నింపుకుంటే నెల రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు ఆ ఆయిల్‌ను ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ముడ‌త‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.మ‌రియు మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా కూడా ఉంటాయి.

ఆ హావభావాలు చూపెట్టగల నటి ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ?