వింట‌ర్‌లో ఈ సూప్ తాగితే ఇమ్యూనిటీ సూప‌ర్‌గా పెరుగుతుంద‌ట‌!

వింట‌ర్ సీజ‌న్ స్టార్ అయింది.ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వాతావ‌ర‌ణం మార్పులు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రి ఇమ్యూనిటీ సిస్టిమ్ బ‌ల‌హీనంగా మారిపోతుంది.

అందు వ‌ల్ల‌నే, వింట‌ర్‌లో జ‌లుబు, ఫ్లూ, ద‌గ్గు, ఆస్తమా, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, ముక్కు నుండి రక్తం రావ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌రుచుకోవాల‌నుకుంటే వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా మీరో సూప్ తీసుకోవాల్సిందే.

అదే మున‌గాకు సూప్‌.అవును, చ‌లి కాలంలో మున‌గాకు సూప్‌ను త‌ర‌చూ తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

పైగా మునగాకు సూప్‌ను త‌యారు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కూడా కాదు.

మొద‌ట ఒక పాత్ర‌లో రెండు స్పూన్ల‌ నూనెను వేసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక అర స్పూన్ జీల‌కర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు మూడు వేసి వేయించాలి.

ఆ త‌ర్వాత అర క‌ప్పు ఉల్లిపాయ ముక్క‌లు, అర క‌ప్పు ట‌మాటా ముక్క‌లు, చిటికెడు ఉప్పు వేసి ప‌చ్చి వాస‌న పోయేవ‌ర‌కు ఫ్రై చేసి.

ఆపై క‌డిగిన మున‌గాకు కూడా వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.

"""/"/ ఇప్పుడు రెడు గ్లాసుల వాట‌ర్, అర స్పూన్ మిరియాల పొడి, రుచికి స‌రిప‌డా ఉప్పు వేసుకుని పావు గంట పాటు మ‌రిగిస్తే.

మున‌గాకు సూప్ సిద్ధ‌మైన‌ట్టే.వింట‌ర్ సీజ‌న్‌లో ఈ మున‌గాకు సూప్‌ను వారానికి మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే గ‌నుక‌.

ఇమ్యూనిటీ ప‌వ‌న్ సూప‌ర్‌గా పెరుగుతుంది.దాంతో జ‌లుబు, ఫ్లూ, ద‌గ్గు, జ్వ‌రం వంటి సీజ‌న్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

"""/"/ అంతేకాదు, మున‌గాకు సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

ర‌క్త హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.దృష్టి సంబంధిత స‌మ‌స్య‌లేమైనా ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు సైతం వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

Chandrababu : మదనపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!