జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే ఇది మీ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిందే!

వయసు పైబడిన వారిలో జ్ఞాపకశక్తి ( Memory )మందగించడం అనేది సర్వసాధారణం.కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ సమస్యను చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.

పోషకాహార లోపం, ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, పెయిన్ కిల్లర్స్ ను అధికంగా వాడటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఏదేమైనప్పటికీ మీకు కూడా జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి.

వెంటనే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని డైట్ లో చేర్చుకోండి.ఈ స్మూతీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

జ్ఞాపకశక్తి మరియు ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక అవకాడో( Avocado ) ని తీసుకుని వాటర్ తో కడగాలి.

ఆ తర్వాత సగానికి కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

అలాగే మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled Oats ) వేసి ఒక కప్పు వాటర్ పోసి ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

"""/" / ఆ తర్వాత బ్లెండర్ లో నానబెట్టుకున్న ఓట్స్ ను వేసుకోవాలి.

అలాగే అవకాడో పల్ప్, వన్ టేబుల్ స్పూన్ అవ‌కాడో గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతోంది.

ఈ అవకాడో బాదం స్మూతీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

"""/" / ఈ స్మూతీని రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే మెదడు కణాలు మెరుగ్గా పనిచేస్తాయి.

బ్రెయిన్ సూపర్ షార్ప్ గా మారుతుంది.దీంతో జ్ఞాపక శక్తి తో పాటు ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతుంది.

అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.అంతేకాదు ఈ అవకాడో బాదం స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం బ‌రువు అదుపులో ఉంటుంది.

ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.మరియు బాడీ రోజంతా ఎనర్జిటిక్ గా సైతం ఉంటుంది.

న్యూయార్క్: షేర్డ్‌ అపార్ట్‌మెంటే అయినా రూ.1.7 లక్షల మంత్లీ రెంట్!