ఈ ఒక్కటి డైట్ లో ఉంటే మోకాళ్ళ నొప్పులను సులభంగా తరిమికొట్టొచ్చు!

మోకాళ్ళ నొప్పులతో( Knee Pains ) బాధపడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారు.

మోకాళ్ళ నొప్పులను నివారించుకునేందుకు చాలా మంది ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని డైట్ లో చేర్చుకుంటే మోకాళ్ళ నొప్పులను సులభంగా తరిమికొట్టొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/"/ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ సత్తు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ) వేసి తీసుకోవాలి.

ఈ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి.

దీంతో మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/"/ రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండేందుకు అవసరమయ్యే శక్తి లభిస్తుంది.మెదడు మునుప‌టి కంటే చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవచ్చు.

ఈ స్మూతీని తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.మెటబాలిజం రేటు( Metabolism ) పెరిగి వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

తెరపైకి మాజీ మంత్రి కారుమూరి అవినీతి ? సిఐడి విచారణ ?