ఈ టేస్టీ స్మూతిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ తో సహా ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అనేది అందరికీ అతిపెద్ద శత్రువుగా మారింది.ఈ మహమ్మారి నుంచి బయటపడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు.
అయితే ఏమీ తినకుండా నోరు కట్టేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అని అనుకోవడం చాలా పొరపాటు.
ఎందుకంటే వెయిట్ లాస్ కు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఒకటి.
ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ తో సహా మరిన్ని అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాస్ ఆల్మండ్ మిల్క్, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి.
మరుసటి రోజు మూడు స్ట్రాబెరీ లను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఓవర్ నైట్ ఓట్స్ ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష ముక్కలు వేసి బాగా కలిపితే ఓట్స్ స్ట్రాబెరీ స్మూతీ సిద్దమవుతుంది.
ఈ స్మూతీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. """/"/
ఈ స్మూతీని తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
అతి ఆకలి దూరమవుతుంది.రోజంతా శరీరం యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండడానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది.
అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మెదడు సూపర్ షార్ప్ గా పని చేస్తుంది.
నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.
చర్మం నిగారింపుగా మెరుస్తుంది.మరియు మధుమేహం వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.
జేమ్స్ కామెరూన్ స్థాయికి రాజమౌళి వెళ్లగలుగుతాడా..?