జుట్టు రాల‌కుండా ఒత్తుగా పెరగాలా? అయితే ఈ చిట్కా మీకే!

జుట్టు రాల‌కుండా ఒత్తుగా పెర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ఇది చాలా అసాధ్యంగా మారింది.

కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను యూజ్ చేయ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ ఫాల్ విప‌రీతంగా వేధిస్తుంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌డం కోసం ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన ఆయిల్స్‌, సీర‌మ్స్‌తో పాటు త‌ర‌చూ హెయిర్ ప్యాకులు, హెయిర్ మాస్కులు వేసుకుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే మందులు కూడా వాడ‌తారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాను పాటిస్తే గ‌నుక జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వ‌న్ గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ ల‌వంగాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల డ్రైడ్ రోజ్మేరీ ఆకులు, నాలుగు బిర్యానీ ఆకులు వేసి పావు గంట పాటు మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లారబెట్టుకోవాలి.బాగా కూల్ అయిన త‌ర్వాత ఆ వాట‌ర్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ కొకొన‌ట్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.

"""/" / ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు త‌యారు చేసుకున్న వాట‌ర్‌ను స్ప్రై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు లేదా మూడు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఇలా చేశారంటేహెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?