ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు ఆగుతుంది!
TeluguStop.com
జుట్టు విపరీతంగా రాలిపోతుంటే ఎవరికైనా బాధే కలుగుతుంది.హెయిర్ ఫాల్ ను ఎలాగైనా అడ్డుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తూ ఉంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మాత్రం జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ఉల్లిపాయ(Onion) ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉసిరి పొడి, వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా ఉల్లిపాయ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలిక పాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్(Hair Mask) ను కనుక వేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.వెంట్రుకలు రాలడం క్రమంగా ఆగిపోతుంది.
"""/" /
అలాగే ఈ మాస్క్ జుట్టును (Hair)ఆరోగ్యంగా మారుస్తుంది.ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
చుండ్రు సమస్యను సంపూర్ణంగా నివారిస్తుంది.మీ కురులకు చక్కని పోషణ అందిస్తుంది.
అంతేకాకుండా ఉసిరి పొడిలో ఉండే పలు పోషకాలు జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఇది జుట్టు త్వరగా తెల్లబడకుండా అడ్డుకుంటుంది.