ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు!
TeluguStop.com
టీనేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందిని కలవరపెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు ( Pimples )ముందు వరుసలో ఉంటాయి.
మొటిమల కారణంగా కొందరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.మొటిమలను నివారించుకోవడం కోసం రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.
అయినా కూడా ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక మదన పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే మొటిమలతో ఇక మదన పడాల్సిన అవసరమే ఉండదు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Lentils ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), ఒక కప్పు ఎండిన వేపాకు( Dried Neem ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పౌడర్ ను వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. """/" /
అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.
వారానికి రెండుసార్లు ఈ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.
వేపాకులో ఉండే గుణాలు మొటిమలకు వ్యతిరేకంగా పోరాడతాయి.మొటిమలు మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేస్తాయి.
"""/" /
అలాగే ఓట్స్ చర్మాన్ని మృదువుగా కోమలంగా మారుస్తాయి.ఎర్ర కందిపప్పు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.
చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.ఫైనల్ గా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల బెడద తగ్గడమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా మెరిసిపోతుంది.
చర్మం ఆరోగ్యంగా మారుతుంది.మచ్చలు తగ్గుతాయి.
మరియు ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా తగ్గుముఖం పడుతుంది.
వైరల్ వీడియో: పెద్దాయనే కానీ మహానుభావుడు..