ఈ సర్పంచ్ మామూలోడు కాదు.. ఊరికి 3 ఎయిర్‌పోర్ట్స్ తీసుకొస్తానని హామీ!
TeluguStop.com
పంచాయతీ ఎన్నికలకు భారతదేశంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.స్థానిక స్థాయిలో జరిగే ఈ పోటీలు అట్టడుగు స్థాయి సమస్యలపై లోతైన కోణాన్ని అందించగలవు.
సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన వారు అందరూ ఈ సమస్యలను పరిష్కరించేందుకు హామీలు ఇస్తుంటారు.
అయితే హర్యానా రాష్ట్రం, సిర్‌సాఢ్ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు ఇచ్చిన హామీలు అందరినీ నవ్వించేలా చేస్తున్నాయి.
ఈ అభ్యర్థి తన పోస్టర్-కమ్-మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూసి చాలామంది అవాక్కవుతున్నారు.ఈ అభ్యర్థి పేరు జైకరన్ లాత్వాల్.
ఈ అభ్యర్థి ప్రచురించిన మేనిఫెస్టో చిత్రాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.
ఈ పోస్టర్‌లో సర్పంచ్ అభ్యర్థి జైకరన్ లాత్వాల్ విద్యావంతుడు, కష్టపడి పనిచేసేవాడు, దృఢనిశ్చయం, నిజాయితీ గల అభ్యర్థి అని పేర్కొన్నారు.
ఇంతవరకు అంతా బాగనే ఉంది.కాకపోతే రాసిన హామీలే చాలా వింతగా అనిపించాయి.
ఆ హామీలు చూస్తుంటే పీఎం పదవి అభ్యర్థి కూడా చేయలేరేమోనని అనిపిస్తోంది. """/"/
ఇంతకీ అతను ఇచ్చిన హామీలు ఏంటంటే.
గెలుపొందిన తర్వాత, లత్వాల్ గ్రామంలో మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తానని చెప్పాడు.రూ.
20కే లీటర్ పెట్రోల్‌ను, రూ.100కే ఒక గ్యాస్ సిలిండర్‌ను సైతం ఆఫర్ చేస్తానని ప్రకటించాడు.
అది సరిపోకపోతే, జీఎస్‌టీని సైతం రద్దు చేస్తానని కూడా హామీ ఇచ్చాడు.చేతులు కట్టుకుని వినయంగా, నమ్మకస్తుడిగా ఈ అభ్యర్థి కనిపించాడు.
ఉచిత వై-ఫై, మహిళలందరికీ మేకప్ కిట్లు, ప్రతి కుటుంబానికి ఫ్రీగా బైక్‌లు, రోజుకు ఒక బాటిల్ మద్యం కూడా ఇస్తానని అతను చేసిన ప్రమాణాలు ఇప్పుడు అందరినీ నవ్విస్తున్నాయి.
ఈ పోస్టర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?