ఈ స‌లాడ్ డైట్‌లో ఉంటే వేస‌విలోనూ చ‌ల్ల‌గా ఉండొచ్చు!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.ఈ సారి మార్చి రెండో వారం నుంచే భానుడి భ‌గ‌భ‌గలు మొద‌ల‌య్యాయి.

రోజురోజుకు ఎండ‌లు దంచికొడుతుండ‌టంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.ఇప్పుడే ఇలా ఉంటే మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగిపోతాయో ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన ప‌ని లేదు.

అయితే వేస‌విలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి.అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే స‌లాడ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తుంది.మ‌రి ఆ స‌లాడ్ ఏంటో.

ఎలా త‌యారు చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక క‌మాల పండు, చిన్న సైజ్ పుచ్చ‌కాయ‌, ఒక యాపిల్‌, ఒక కీర తీసుకుని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత వేటికవి విడి విడిగా క‌ట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో క‌ట్ చేసుకున్న‌ పుచ్చ‌కాయ ముక్క‌లు, క‌మాల పండు ముక్క‌లు, యాపిల్ ముక్క‌లు, కీర ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్‌ మసాలా, రుచి కోసం చిటికెడు న‌ల్ల ఉప్పు వేసి క‌లుపుకుంటే స‌లాడ్ సిద్ధ‌మైన‌ట్టే.

"""/"/ ఈ సూప‌ర్ టేస్టీ స‌లాడ్‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల వేస‌విలోనూ మీ శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.వేస‌వి వేడి వ‌ల్ల వ‌చ్చే త‌ల‌నొప్పి, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

అంతే కాదు, పైన చెప్పిన విధంగా స‌లాడ్‌ను త‌యారు చేసుకుని తీసుకుంటే గ‌నుక‌ అధిక ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

శ‌రీరం శ‌క్తివంతంగా మారుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

చ‌ర్మం తాజాగా, య‌వ్వ‌నంగా మెరుస్తుంది.మ‌రియు ర‌క్త పోటు స్థాయిలు సైతం అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

ఏపీకి మంచి రోజులే ప్రధాని మోడీ ప్రసంగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!