టాన్ ను పోగొట్టి 20 నిమిషాల్లో ముఖాన్ని బ్రైట్ గా మార్చే రెమెడీ మీ కోసం!
TeluguStop.com
ఒక్కోసారి ముఖం ఫుల్లుగా టాన్( Skin Tan ) అయిపోతూ ఉంటుంది.దాంతో చర్మం నల్లగా కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.
అటువంటి స్కిన్ ను రిపేర్ చేసుకునేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్ కు పరుగులు పెడుతుంటారు.
అక్కడ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే సులభంగా టాన్ ను పోగొట్టుకోవచ్చు.
కేవలం ఇరవై నిమిషాల్లో ముఖాన్ని వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) మరియు రెండు లెమన్ స్లైసెస్( Lemon Slices ) వేసుకొని ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు మరియు సరిపడా టమాటో లెమన్ ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత ముఖాన్ని పాలతో క్లెన్సింగ్ చేసుకోవాలి.క్లెన్సింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల టాన్ మొత్తం తొలగిపోతుంది.డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ అవుతాయి.
స్కిన్ ఇరవై నిమిషాల్లో వైట్ గా మరియు సూపర్ గ్లోయింగ్ గా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.కాబట్టి స్కిన్ టాన్ అయినప్పుడు, ముఖంలో మెరుపు మాయం అయినప్పుడు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మ్యాజికల్ రిజల్ట్ ను పొందండి.
సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?