గడ్డం, మీసాలు ఒత్తుగా పెరగాలని కోరుకునే పురుషులకే ఈ రెమెడీ!
TeluguStop.com
గడ్డం, మీసాలు.ఒత్తుగా పెరగాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు.
ఒక వయస్సు వచ్చే సరికి గడ్డం, మీసాలు బాగా పెరుగుతాయి.కానీ, కొందరికి మాత్రం ఏళ్లు గడుస్తున్నా గడ్డం, మీసాలు సరిగ్గా పెరగవు.
ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.కారనం ఏదైనా గడ్డం, మీసాలను దట్టంగా పెంచుకునేందుకు మార్కెట్లో లభ్యం అయ్యే ఖరీదైన ఆయిల్స్, సీరంలను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే.
ఈ రెమెడీ పల్చటి గడ్డం, మీసాలు కేవలం కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మార్చేందుకు సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏమిటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు పొడి, రెండు బిర్యానీ ఆకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన అనంతరం.
వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
"""/"/
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా వేసి కలపాలి.ఇప్పుడు ఈ వాటర్ ను స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.
మీసాలకు మరియు గడ్డానికి ఒకటికి రెండు సార్లు ఈ వాటర్ ను స్ప్రే చేసుకుని గంట లేదా గంటన్నర పాటు వదిలేయాలి.
అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే కేవలం కొద్ది రోజుల్లో గడ్డం, మీసాలు ఒత్తుగా మరియు నల్లగా పెరుగుతాయి.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!