పల్చటి జుట్టుతో బాధపడే పురుషులు ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!
TeluguStop.com
ఒత్తిడి, పోషకాల కొరత, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, కాలుష్యం తదితర కారణాల వల్ల కొందరి పురుషుల జుట్టు చాలా అంటే చాలా పలుచగా మారుతుంటుంది.
ఇలాంటివారు జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.అందులోనూ పెళ్లికాని పురుషులు అయితే ఇంకా మదన పడుతుంటారు.
ఎందుకంటే ఇటీవల రోజుల్లో ఎంత మంచి ఉద్యోగం ఉన్నా సరే ఒత్తైన జుట్టు లేకుంటే అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు.
అందుకే జుట్టు పల్చబడితే తెగ హైరానా పడిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా కేవలం కొద్ది రోజుల్లోనే మళ్లీ ఒత్తుగా మారుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.
"""/"/
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక కప్పు వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు, అర కప్పు మజ్జిగ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.
హెయిర్ ఫాల్ సమస్య ఉంటే దూరం అవుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా సైతం ఉంటుంది.
కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడే పురుషులు ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!