చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి క్షణాల్లో వైట్ గా, బ్రైట్ గా మార్చే రెమెడీ ఇది.. డోంట్ మిస్!
TeluguStop.com
సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం( Facial Skin ) టాన్ అయిపోయి నిర్జీవంగా, కాంతిహీనంగా మారిపోతుంటుంది.
ముఖంలో అస్సలు గ్లో అనేది ఉండదు.అలాంటి సమయంలోనే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ కు లేదా ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉంటే కాలు తీసి బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు.
అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే క్షణాల్లో మీ స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.
చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.మరియు ఎన్నో బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్,( Activated Charcoal Powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు, సరిపడా బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
"""/" /
పూర్తిగా డ్రై అయిన అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.
చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.క్షణాల్లో చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.
ఇన్స్టెంట్ గ్లోయింగ్ కావాలని కోరుకునే వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఇందులో పెరుగు( Curd ) ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
కోమలంగా మృదువుగా మెరుస్తుంది.కాబట్టి స్కిన్ డల్ గా కాంతిహీనంగా ఉన్నప్పుడు హైరానా పడిపోకుండా ఈ రెమెడీని పాటించండి.
క్షణాల్లో అందంగా మెరిసిపోండి.
హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు