కేవలం ఓ పింగాణీ పాత్ర కోసం వారు కోట్ల రూపాయిలు చెల్లించారు, ఎందుకంటే?

అవును, ఆశ్చర్యంగా వున్నా మీరు విన్నది నిజమే.కేవలం ఓ పింగాణీ పాత్ర( Porcelain Vessel ) కోసం కోట్ల రూపాయిలు వెచ్చించారంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా.

ఇపుడు ఆ విషయమే మాట్లాడుకుందాం.సాధారణంగా వేలం పాటలో( Auction ) పురాతన వస్తువులను అమ్మడం గురించి మీరు వినే వుంటారు.

ఈ క్రమంలో కొంతమంది ఎక్కువ ధరను పెట్టి కొనడం గురించిన వార్తలు మీరు చూసే వుంటారు.

అయితే వేలం నిర్వాహకులు సహా ఎవ్వరు ఊహించని ధర పలికితే.పరిస్థితి ఎలాగుంటుంది.

సరిగా అలాంటి ఘటనే ఇంగ్లండ్లో జరిగింది. """/" / ఓ చిన్ని పింగానీ పాత్రను వేలంలో పెట్టగా అక్కడ ఊహించని ధర పలికింది.

విషయంలోకి వెళితే, ఇంగ్లండ్ లోని( England ) డోర్చెస్టర్ కు చెందిన డ్యూక్స్ ఆక్షనీర్స్ సంస్థ తరచూ పురాతన వస్తువులను వేలం వేస్తుంటుంది.

ఆ సంస్థ పనే అది.ఈ క్రమంలో ఇటీవల ఓ పురాతన పిగాణి పాత్రను వేలం వేయగా అది ఏకంగా రూ.

1.09 కోట్లు పలికింది.

దాంతో దాన్ని వేలం వేసిన నిర్వాహకులు సైతం అవాక్కయ్యారు.ఇక వేలంలో పెట్టిన పింగాణి పాత్ర ధర మచ్చుకు వందల్లో ఉంటుంది.

ఇక అది వేలంలో మహా అయితే రూ.10వేల ధర పలుకుతుందని అనుకున్నారు.

దాంతో వేలం పాటను రూ.3,169 నుంచి స్టార్ట్ చేశారు.

"""/" / కాగా ఈ వేలంలో చాలామంది బిడ్ వేయగా అందులోని కొంతమంది నిపుణులైన బిడ్డర్లు.

ఇది చైనాకు చెందిన మింగ్ వంశీకుల నాటి( Ming Dynasty ) వస్తువని గుర్తించారు.

దాంతో వేలంపాట ఒక్కసారిగా ఎవరి అంచనాలకు అందని విధంగా మారిపోయింది.అక్కడికి వచ్చినవాళ్లంతా అనూహ్యంగా ధర పెంచుకుంటూ పోయారు.

చివరకు ఇంగ్లండ్ కు చెందిన ఓ పురావస్తు సేకర్త దీన్ని 1.04 లక్షల పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.

1.09 కోట్లుకు సొంతం చేసుకున్నాడు.

ఇక మింగ్ వంశీకులు చైనాను 1368 నుంచి 1644 కాలంలో పాలించారు.వాళ్ల హయాంలో తయారైన వస్తువులు అత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రతీతి.

అందుకే దాని దాని ధర అంత పలికిందని నిపుణులు అంచనా వేశారు.

కొరియన్, మలయాళం భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తున్న ఎన్నారై బాలుడు..?