కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? అయితే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో దీన్ని చేర్చండి!

ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సు పైబ‌డిన వారే కాదు ముప్పై ఏళ్ల వారు సైతం కీళ్ల నొప్పుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు.

కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు కూర్చుంటే లేవ‌లేరు, లేస్తే కూర్చోలేరు.అందులోనూ ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం కార‌ణంగా కీళ్లు మ‌రింత అధికంగా నొప్పి పుడుతుంటాయి.

మిమ్మ‌ల్ని కూడా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.? అయితే డోంట్ వ‌ర్రీ.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే రెసిపీని మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేరిస్తే కీళ్ల నొప్పులు ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఓ రెసిపీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌క ముందే రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని.అందులో రుచికి స‌రిప‌డా పింక్ సాల్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల‌ బెల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర క‌ప్పు ప‌చ్చి కొబ్బ‌రి వేసుకుని ద‌గ్గ‌ర ప‌డేంత వ‌ర‌కు ఉడికించుకోవాలి.

"""/" / ఇలా ఉడికించుకున్న మిశ్ర‌మం కాస్త చ‌ల్లారేలోపు ఒక యాపిల్ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను రాగి మిశ్ర‌మంలో క‌లపాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ను కూడా యాడ్ చేసుకుంటే.

హెల్తీ అండ్ టేస్టీ రాగి రెసిపీ సిద్ధం అవుతుంది.దీనిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.

ఆరోగ్యానికి చాలా మంచిది.రాగులు బలవర్దకమయిన ధాన్యం.

రాగుల్లో మ‌రియు కొబ్బ‌రిలో క్యాల్షియం పుష్కలంగా నిండి ఉంటుంది.అందువ‌ల్ల పైన చెప్పిన‌ రాగి రెసిపీని డైట్ లో చేర్చుకుంటే ఎముకలు పటుత్వంగా మార‌తాయి.

దాంతో కీళ్ల నొప్పులు క్ర‌మంగా మార‌తాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?