ఈ రెండు కలిపి జుట్టుకు రాస్తే హెయిర్ ఫాల్ పరార్..!

జట్టు అధికంగా ఉండిపోతుందా.? ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా హెయిర్ ఫాల్( Hairfall ) కంట్రోల్ అవ్వడం లేదా.

? రోజురోజుకు కురులు పల్చగా మారిపోతున్నాయా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీని కనుక పాటించారంటే హెయిర్ ఫాల్ దెబ్బకు పరార్ అవ్వడం గ్యారెంటీ.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని పీల్ తొలగించి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సెపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్( Hair Tonic ) రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ని నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

"""/" / ఉల్లిపాయ, కాఫీ.ఈ రెండిటి కాంబినేషన్ ఒక మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుంది.

ఉల్లిలోని సల్ఫర్ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది జుట్టును బలోపేతం చేస్తుంది.

ఉల్లిలోని విట‌మిన్ బి2 జుట్టు రాల‌డాన్ని నిరోధిస్తుంది.ఉల్లి రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పొడి స్కాల్ప్, చుండ్రు మరియు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలోనూ తోడ్ప‌డుతుంది. """/" / అలాగే జుట్టు రాలడాన్ని అరికట్టడంలో కాఫీ పౌడర్ కూడా ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.

కాఫీ సహజంగా జుట్టును నల్లగా చేస్తుంది.కాఫీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

స్కాల్ప్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది.జుట్టు వేగంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

మ‌రియు కాఫీ పౌడ‌ర్ ను జుట్టును మృదువుగా మెరిసేలా సైతం చేస్తుంది.

ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…