పెదాల నలుపును పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్..!
TeluguStop.com
పెదాలు( Lips ) గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.
అందుకే అటువంటి పెదాల కోసం మగువలు తెగ ఆరాటపడుతుంటారు.అయితే ఎంత ప్రయత్నించినా కూడా కొందరికి లిప్స్ అనేవి డార్క్ గా ఉంటాయి.
ఎండల ప్రభావం, పిగ్మెంటేషన్, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే లిప్‌స్టిక్స్ వాడటం తదితర కారణాల వద్ద పెదాలు నల్లగా మారిపోతుంటాయి.
దాంతో పెదాల నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. """/" /
మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
ముందుగా ఒక చిన్న టమాటోని( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్( Sugar Powder ) వేసుకోవాలి.
అలాగే హాఫ్ టీ స్పూన్ తేనె మరియు హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వేళ్ళతో సున్నితంగా పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల పెదాల నలుపు క్రమంగా మాయమవుతుంది.
డార్క్ లిప్స్ గులాబీ రంగులోకి మారి అందంగా ఆకర్షణీయంగా మెరుస్తాయి.పెదాలపై పేరుకుపోయిన మురికి మృత కణాలు సైతం తొలగిపోతాయి.
పెదాలు మృదువుగా మారతాయి.కాబట్టి అందమైన మెరిసే పెదాలను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
షెన్‌జెన్ స్టేషన్‌లో మహిళ నిర్వాకం.. స్నేహితుల కోసం ఏకంగా రైలు డోర్‌నే అడ్డగించింది?