రోజు ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా ఎన్నో సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!

అధిక బరువు సమస్య(Overweight Problem )తో బాధపడుతున్నారా? ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ ను భరించలేకపోతున్నారా? పెరిగిన బరువును తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ పొడిని రోజు పాలతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా ఎన్నో సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఎనిమిది టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి( Dry Coconut Powder ) వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

ఈ కొబ్బరి పొడిలో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఆరు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి, మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి( Elachi Powder ), రెండు టేబుల్ స్పూన్లు అల్లం పొడి, వ‌న్‌ టేబుల్ స్పూన్‌ జాజికాయ పొడి, రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మన పొడి సిద్ధ‌మైనట్లే.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్‌ పాలల్లో వేసి ఎనిమిది నిమిషాల పాటు మరిగించి ఫిల్టర్ చేసుకుని తేనె లేదా బెల్లం తురుము కలిపి సేవించాలి.

రోజు ఇలా చేస్తే శరీరంలో క్యాలరీలు చాలా వేగంగా కరుగుతాయి.దాంతో బరువు తగ్గుతారు.

పొట్ట కొవ్వు సైతం కరిగిపోతుంది. """/"/ అంతే కాదు ఈ పొడిని పాల‌తో కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు( Knee Pain ) ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది.

గుండెపోటు, క్యాన్సర్ మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.దంతాలు దృఢంగా మారతాయి.

చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు దూరం అవుతాయి.ఆడవారిలో నెలసరి క్రమం తప్పకుండా ఉంటుంది.

మరియు ఈ పొడి నెలసరి నొప్పులను నివారించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024