ఈ పెంపుడు కుక్క టాలెంట్ అదుర్స్.. చక్కగా వాలీబాల్ ఆడేస్తోంది
TeluguStop.com
పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు కూడా వాలీబాల్( Volleyball ) ఆడటం చూసి ఉంటారు.
అయితే జంతువులు వాలీబాల్ ఆడడం ఎప్పుడైనా చూశారా? కానీ ఓ పెంపుడు కుక్క అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది.
ప్రొఫెషనల్ క్రీడాకారుడిలా చక్కగా వాలీబాల్ ఆడుతోంది.గతంలో కరోనావైరస్ కారణంగా, దాదాపు అన్ని క్రీడల టోర్నమెంట్‌లు రద్దు చేయబడ్డాయి.
అటువంటి పరిస్థితిలో, ఆటగాళ్ళు వారి ఇళ్లలోనే ఆటలు ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో గడపడం వంటివి చేశారు.
అవి సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేసినప్పుడు వైరల్ అయ్యాయి.
ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
"""/" /
పెంపుడు జంతువులు చాలా విశ్వాసంగా ఉంటాయి.ముఖ్యంగా కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా నిలుస్తాయి.
ఒక్కోసారి ఇంట్లో దొంగలు పడ్డప్పుడు, లేదా ఏదైనా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి సమస్యపై పోరాడుతాయి.
ఒక్కోసారి తమ యజమానుల కోసం ప్రాణాలు సైతం విడుస్తాయి.ఒక వేళ పొరపాటున వాటి యజమానులు చనిపోయినప్పుడు ఆ మృతదేహం వద్దే దీనంగా ఉంటాయి.
ఇలాంటి వీడియోలు మనం తరచూ చూస్తుంటాం.అయితే కొన్ని కుక్కలు చాలా సుశిక్షితులుగా ఉంటాయి.
ఇదే కోవలో ఓ కుక్క తన యజమానులతో కలిసి వాలీబాల్ ఆడింది.వాలీబాల్‌లో అనుభవజ్ఞుడైన సెట్టర్‌లా బంతిని నుదిటితో కొట్టి తన సహచరుడికి పాస్ చేసింది.
ఇలా వరుసగా మూడు నాలుగు సార్లు చేసింది. """/" / ఈ వీడియో 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో బ్యూటెంటెబిడెన్ ఖాతాలో పోస్ట్ చేయబడింది.
కొందరు పురుషులు వాలీబాల్ ఆడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.నెట్‌కు ఒకవైపు ఇద్దరు వ్యక్తులు ఉండగా, మరోవైపు ఒక వ్యక్తి మరియు కుక్క( Pet Dog ) ఆడుకుంటున్నారు.
వీడియో మొదట్లో కుక్కను ఇలా ఆడుకుంటున్నట్లు అనిపించినా కొంత సమయం తర్వాత ఆ కుక్క బంతిని తలతో కొట్టిన దృశ్యం చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
కుక్క టాలెంట్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.చాలా చక్కగా వాలీబాల్ ఆడుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పాకిస్థానీ లవర్ కోసం కరాచీ వెళ్లిన అమెరికన్ లేడీ.. తర్వాతేమైందో తెలిస్తే షాకే..?