ఈ ఒక్కటి డైట్ లో ఉంటే షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!
TeluguStop.com
బార్లీ( Barley ).దీని గురించి వినే ఉంటారు.
ఇది తృణధాన్యాల్లో ఒకటి.ప్రపంచవ్యాప్తంగా బార్లీని విరి విరి గా వాడుతున్నారు.
బార్లీ గింజలతో సూప్ లు, బ్రెడ్ తదితర వంటకాలు తయారు చేస్తుంటారు.బార్లీ గింజల్లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
అవి మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా బార్లీ గింజలు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్( Sugar ) నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు బార్లీ గింజలు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే నానబెట్టుకున్న బార్లీ గింజలు వేసి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
"""/" /
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో బార్లీ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ కాస్త చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ), నాలుగు లేదా ఐదు క్రష్ చేసిన పుదీనా ఆకులు( Mint Leaves ) మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి సేవించాలి.
ఈ బార్లీ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. """/" /
జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
మరియు నీరసం అలసట వంటివి సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.కాబట్టి, ఇన్ని ప్రయోజనాలు అందించి ఈ బార్లీ డ్రింక్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తా… జడ్జ్ చేయను పూరి సినిమాపై విజయ్ సేతుపతి కామెంట్స్!