చలికాలంలో జుట్టు మరింత అధికంగా ఊడుతుందా? అయితే మీరీ ఆయిల్ వాడాల్సిందే!

ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే మిగిలిన సీజన్లతో పోలిస్తే ప్రస్తుత చలికాలంలో కొందరికి జుట్టు మరింత అధికంగా ఊడిపోతూ ఉంటుంది.

దాంతో ఏం చేయాలో‌ తెలియక.హెయిర్ ఫాల్ కు ఎలా అడ్డుకట్ట వేయాలో అర్థం కాక మదన పడుతూ ఉంటారు.

మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ ను మీరు వాడాల్సిందే.

ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు మరిన్ని ప్రయోజనాలను సైతం పొందొచ్చు.

మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక్క గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.

నూనె హీట్ అవ్వడానికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

"""/"/ ఆ త‌ర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్‌ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన అనంతరం ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించడానికి ముందు జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.

మరుస‌టి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

"""/"/ వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక రాసుకుంటే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.

దాంతో జుట్టు రాల‌డం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య ఏమైనా ఉంటే దూరం అవుతుంది.

తలలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుముఖం పడ‌తాయి.మరియు తెల్ల జుట్టు సమస్య త్వరగా ద‌రిచేర‌కుండా సైతం ఉంటుంది.

వర్షం కురుస్తోందని చెట్టు కిందకి వెళ్ళింది.. అంతలోనే దారుణం..??