తెల్ల జుట్టుతో చింతెందుకు.. ఈ ఆయిల్ ను వాడితే సహజంగానే మీ హెయిర్ బ్లాక్ అవుతుంది!

వయసు పైబ‌డే కొద్ది జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) తగ్గుతుంది.దీని కారణంగా నల్లటి కురులు మెల్లమెల్లగా తెల్లబడటం స్టార్ట్ అవుతాయి.

చాలా మంది వైట్ హెయిర్ ను( White Hair ) అస్సలు ఇష్టపడరు.

ఈ క్రమంలోనే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ రంగులు వాడుతుంటారు.అయితే అవి జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

హెయిర్ ఫాల్ ను పెంచుతాయి.అలాగే జుట్టు ఎదుగుదలను దెబ్బతీస్తాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడితే సహజంగానే మీ హెయిర్ బ్లాక్ అవుతుంది.

పైగా ఈ ఆయిల్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ తర్వాత అందులో ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు( Curry Leaves ) వేసి నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.

ఇప్పుడు వీటిని చల్లార పెట్టుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఆవనూనె( Mustard Oil ) వేసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు కరివేపాకు పొడిని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు రోజులపాటు వదిలేయాలి.

"""/" / అనంతరం స్ట్రైనర్ లేదా వస్త్రం సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని బాటిల్ లో నింపుకోవాలి.

ఈ ఆయిల్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించి మరుసటి రోజు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

లేదా తల‌స్నానం చేయడానికి రెండు గంటల ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకున్నా పరవాలేదు.

"""/" / వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కానుక వాడితే తెల్ల జుట్టు క్రమంగా దూరమవుతుంది.

సహజంగానే మీ కురులు నల్లగా మారతాయి.ఈ ఆయిల్ ను వాడితే ఎటువంటి కలర్స్ అవసరం లేదు.

పైగా ఈ ఆయిల్ మీ హెయిర్ రూట్స్ ను( Hair Roots ) స్ట్రాంగ్ గా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

2025 సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ సినిమాలు.. పోటీ మామూలుగా ఉండదంటూ?