బలహీనమైన కురులకు బలానిచ్చే బెస్ట్ ఆయిల్ ఇదే..తప్పకుండా తెలుసుకోండి!
TeluguStop.com
ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, వాతావరణంలో వచ్చే మార్పులు, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల కురులు బలహీన పడుతుంటాయి.
ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య రోజురోజుకు తీవ్ర తరంగా మారుతుంది.దాంతో ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన నూనెలు, షాంపూలు, సీరమ్‌లు జుట్టుకు రాస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుంటే హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు కూడా వాడతారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను తయారు చేసుకుని వాడితే.
బలహీనమైన కురులను బలంగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటో.
? దాన్ని ఎలా తయారు చేయాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ కొబ్బరి తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉసిరి కాయ పొడి, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్, ఒక స్పూన్ మెంతులు, అర గుప్పెడు తులసి ఆకులు, అర గుప్పుడె కరివేపాకు వేసి బాగా కలిపి.
స్లో ఫ్లేమ్‌పై బాగా మరిగించాలి.మరిగిన నూనెను చల్లారబెట్టుకుని.
ఆపై ఫిల్టర్ చేసుకోవాలి.తడి లేని బాటిల్‌ను తీసుకుని అందులో ఈ నూనెను నింపుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి సున్నింతగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఈ నూనెను వారంలో మూడు సార్లు రాసుకుంటే బలహీనమైన జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.
జుట్టు కుదుళ్లు బలంగా మారాయంటే.ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయిపోతుంది.
"""/"/
పైగా పైన చెప్పిన నూనెను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.
జుట్టు పొడి బారకుండా ఉంటుంది.చుండ్రు సమస్య సైతం వదిలిపోతుంది.
కాబట్టి, ఎవ్వరైనా ఈ నూనెను నిశ్చింతగా వాడొచ్చు.
శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబోలో భారీ సినిమా రాబోతోందా..?